ప్రభాస్, మహేష్‌ ల అసలు గుట్టు బయటపెట్టిన ఎం.ఎస్.రాజు
Latest Movies Tollywood

ప్రభాస్, మహేష్‌ ల అసలు గుట్టు బయటపెట్టిన ఎం.ఎస్.రాజు

సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మనసంతా నువ్వే, దేవీపుత్రుడు… ఇలా ఎన్నో సక్సస్ ఫుల్ మూవీస్ అందించారు నిర్మాత ఎం.ఎస్.రాజు. ఆతర్వాత దర్శకుడుగా మారి వాన అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుంచి ఎం.ఎస్. రాజు కెరీర్ లో బాగా వెనకబడ్డారు. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో.. గత సంవత్సరం డర్టీ హరి చిత్రంతో విజయం అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంలో తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 7 డేస్‌ 6 నైట్స్‌.

సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వైల్డ్‌ హనీ ప్రొడక్షన్స్‌, వింటేజ్‌ పిక్చర్స్‌, ఏబిజి క్రియేషన్స్‌ సంస్థలు రూపొందిస్తున్న ఈ చిత్రానికి సుమంత్‌ అశ్విన్‌, రజనీకాంత్‌.ఎస్‌ నిర్మాతలు. ఇదొక కూల్‌, న్యూఏజ్‌ ఎంటర్‌టైనర్‌. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో వినోదానికి, లవ్‌, ఎమోషన్స్‌కి చక్కటి ఆస్కారం ఉంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్ స్టార్ట్ చేసిన ఎం.ఎస్.రాజు ఓ ఇంటర్ వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.

ఇంతకీ ఏం చెప్పారంటే.. మహేష్‌, ప్రభాస్, వెంకటేష్.. ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేశారు కదా.. ఇప్పుడు ఎందుకు స్టార్ హీరోలతో సినిమా చేయడం లేదు అని అడిగితే ఇక స్టార్ హీరోలతో సినిమా చేయను అని ప్రకటించారు. అంతే కాకుండా.. గతంలో మహేష్ తో ఒక్కడు తీసే సమయానికి ఆయన స్టార్ కాదు. అలాగు ప్రభాస్ కూడా వర్షం తీసే టైమ్ కి స్టార్ కాదు. నేను వాళ్లను స్టార్స్ చేశాను. ఇప్పుడు వాళ్లతో సినిమా చేయాలంటే… వాళ్లు డేట్స్ ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. వాళ్లు అడిగినవి అన్ని ఏర్పాటు చేయాలి. కథ విషయంలో రాజీ పడాలి. ఇంకా ఏం చెప్పాలంటే.. వాళ్లు ఏం చెబితే అది చేయాలి. అవన్నీ చేయడం ఇష్టం నాకు ఇష్టం లేదు. అందుకనే మహేష్, ప్రభాస్ లతో సినిమాలు చేయను. వీళ్లనే కాదు.. స్టార్స్ తో ఎప్పుడూ సినిమా చేయలేదు. భవిష్యత్ లో కూడా చేయను అని చెప్పారు. ఎం.ఎస్.రాజు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. అదీ.. సంగతి.

Post Comment