ఫ్లాప్ అయిన ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో. టెన్షన్ లో టీమ్
Movies Tollywood Trending News

ఫ్లాప్ అయిన ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో. టెన్షన్ లో టీమ్

ఆర్ఆర్ఆర్.. నందమూరి అభిమానులు, మెగా అభిమానులు మాత్రమే కాకుండా.. సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సంచలన చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండడంతో ఎప్పుడెప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే.. ఈసారి పక్కా అంటూ అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అంటూ జక్కన్న అఫిషియల్ గా ప్రకటించారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇటీవల రోర్ ఆఫ్ ఆర్‌.ఆర్‌.ఆర్‌ పేరుతో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. రోర్ ఆఫ్‌ ఆర్‌.ఆర్‌.ఆర్ చూస్తుంటే.. సినిమా చూస్తున్న థ్రిల్, అనుభూతి క‌లిగింది. సెట్లో ఎవ‌రెంత క‌ష్ట‌ప‌డ్డారో, దాని వెనుక ఉన్న క‌ష్టాలేంటో… ఈ వీడియోలో చూపించేశారు. ఆ బ్లాస్టింగులు, సెట్లు, తుపాకుల మోత‌.. ముఖ్యంగా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల ఎంట్రీ.. వీట‌న్నింటికంటే మించి కీర‌వాణి ఇచ్చిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌… ఇవ‌న్నీ ఖచ్చితంగా గూజ్ బ‌మ్స్ తెప్పించే మూమెంట్సే. రాజమౌళి ఏం చేసినా ఓ మ్యాజిక్ ఉంటుంది. ఈ మేకింగ్ వీడియోలో కూడా ఆ మ్యాజిక్ కనిపించింది.

అయితే.. ఈ మేకింగ్ వీడియోకి ఇప్పటి వరకు 9.7 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ కి ఇప్పటికే 9.7 మిలియన్ వ్యూస్ కంటే.. అంతకు మించి వ్యూస్ రావాలి కానీ.. రాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఆలస్యం అవ్వడం వలన.. అలాగే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల వలన ఆర్ఆర్ఆర్ పై జనాల్లో ఆసక్తి తగ్గుతుందా..? ఎందుకు ఇంత తక్కువ వ్యూస్ వచ్చాయి..? అని ఆర్ఆర్ఆర్ టీమ్ టెన్షన్ పడుతుందట. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ మూవీని థియేటర్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అప్పటికి ఆర్ఆర్ఆర్ పై క్రేజ్ ని ఎలా తీసుకురావాలి..? కరోనా నుంచి జనాల దృష్టి మరల్చి ఆర్ఆర్ఆర్ వైపుకు తిప్పాలంటే.. కొత్తగా ఏం చేయాలి..? అని ఆర్ఆర్ఆర్ టీమ్ తెగ టెన్షన్ పడుతుందట. మరి.. జక్కన్న ఏ మాయ చేస్తాడో..? ఆర్ఆర్ఆర్ పై అంచనాలను ఎలా పెంచుతాడో చూడాలి.

Post Comment