Advertisement
శ‌భాష్ వ‌ర్మ అంటున్న టాలీవుడ్
Latest Movies Tollywood

శ‌భాష్ వ‌ర్మ అంటున్న టాలీవుడ్

Advertisement

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. వివాదాల‌కు మ‌రో పేరు. త‌న సినిమాల‌తో.. త‌న మాట‌ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటుంటారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. బాలీవుడ్ వెళ్లి అక్క‌డ సంచ‌ల‌నం సృష్టించ‌డంతో టాలీవుడ్ లో వ‌ర్మ అంటే ఓ క్రేజు.. మోజు ఉండేది. అయితే.. రాను రాను వ‌ర్మ ప్ర‌తి చిన్న విష‌యం గురించి త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌డంతో త‌న ఇమేజ్ ను త‌నే పాడుచేసుకున్నాడు అనే టాక్ వుంది. అంద‌రిదీ ఒక దారి అయితే… వ‌ర్మ‌ది మ‌రో దారి.

ఇలాంటి వ‌ర్మను ఊహించ‌ని విధంగా టాలీవుడ్ మొత్తం శ‌భాష్ అని పొడుగుతుంది. ఇలాంటి రోజు వ‌స్తుంద‌ని అస‌లు ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు త‌గ్గించ‌డం.. కొన్ని థియేట‌ర్ల‌ను ప్రామాణాలు పాటించ‌డం లేద‌ని చెప్పి సీల్ చేయ‌డం వివాద‌స్ప‌దం అయ్యింది. దీని గురించి వ‌ర్మ ట్వీట్స్ చేస్తూ.. ఏపీ మంత్రి పేర్ని నానికి, ఇంకా చెప్పాలంటే.. ఏపీ ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపిస్తున్నాడు.

Advertisement