Advertisement
నిజంగానే రామారావు వస్తున్నాడా..?
Latest Movies Tollywood

నిజంగానే రామారావు వస్తున్నాడా..?

Advertisement

మాస్ మహరాజ్ రవితేజ నుంచి ఓ కొత్త సినిమా వస్తోందంటే ఒకప్పుడు ఆయన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హడావిడీ చేసేవారు.కానీ ఈ మధ్య అది బాగా తగ్గిపోయింది. అందుకు కారణం ఏంటో అందరికీ తెలుసు. ఏ మాత్రం కొత్తదనం లేని కథ, కథనాలతో వస్తున్నాడు రవితేజ. ఈ కారణంగానే అతని మార్కెట్ కూడా పడిపోయింది. అయినా తన రెమ్యూనరేషన్ తగ్గించలేదు. ఆ మధ్య వచ్చిన క్రాక్ విజయంతో గాడిలో పడ్డాడు అనుకున్నా.. ఖిలాడీతో మరో డిజాస్టర్ చూశాడు. అయినా వరుస ప్రాజెక్ట్స్ తో చెలరేగిపోతున్నాడీ మాస్ రాజా. అందులో భాగంగానే ఓ కొత్త దర్శకుడితో చేసిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా బాగా రిజిస్టర్ అయింది జనాల్లో. బట్ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా.. ఇప్పటి వరకూ రిలీజ్ డేట్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. మరోవైపు ఈ చిత్రానికి తన రెమ్యూనరేషన్ ఇవ్వని కారణంగా రవితేజ డబ్బింగ్ చెప్పలేదని.. అందుకే గత నెలలోనే విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేశారు అనే రూమర్స్ కూడా హల్చల్ చేశాయి.. అలాగే సినిమాను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనీ.. పడిపోయిన రవితేజ మార్కెట్ కు ఇదే నిదర్శనం అనీ చెప్పుకుంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా బాగా వినిపించింది. మరి మొదటి రూమర్ టైమ్ లో స్పందించని టీమ్.. ఇప్పుడు ఏకంగా అతని మార్కెట్ గురించే చెప్పుకుంటున్నారు కాబట్టి సడెన్ గా రిలీజ్ డేట్ ఇచ్చారా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి చాలామందిలో.

యస్.. రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని జూలై 29న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అయినా ఈ అఫీషియల్ ప్రకటనలదేముందీ.. ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కానీ రూమర్స్ ఎక్కువైన తరుణంలో ఇవ్వడమే నిజంగానే ఈచిత్రం వస్తుందా రాదా అనే డౌట్స్ కు కారణం అవుతోంది. మొత్తంగా రవితేజ ఈ మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని మాత్రం చెప్పుకుంటున్నారు. అయినా ఆలస్యం ఎందుకు అంటే అది వారికే తెలియాలి.రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ్ రెవిన్యూ ఆఫీసర్ గా నటించాడు. శరత్ మండవ డైరెక్టర్ గా పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో మాస్ రాజా సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ తో పాటు మళయాల బ్యూటీ రజీషా విజయన్ హీరోయిన్లు. మరి జూలై 29న అడవి శేష్‌ నటించిన హిట్-2 విడుదల కాబోతోంది. అంతకు ఒకరోజు ముందు సుదీప్ నటించిన కన్నడ డబ్బింగ్ మూవీ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా వస్తోన్న విక్రాంత్ రోణ కూడా వస్తోంది. మరి ఈ ట్రైయాంగిల ఫైట్ లో రామారావు పరిస్థితి ఏమౌతుందో చూడాలి.

Advertisement