అనుష్క కోసం యువీ క్రియేషన్స్ నిర్మాతలు టైట్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పొరపాటున అనుష్క ఫొటో బయటకు పొక్క కూడదనే ఇలాంటి ఏర్పాట్లు చేశారు. అయినా అనుష్క ఫొటో ఎందుకు బయటకు రాకూడదు? అనేది అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న. అందుకు ఆన్సర్‌ ఒక్కటే. అనుష్క చాలా బరువు పెరిగారు. అదీ మహేష్‌.పి. దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టితో నటిస్తున్న సినిమా కోసం. ఆ లుక్‌ ఒక్కసారి బయటకు వస్తే, సినిమా మీద ఎవరికీ పెద్ద ఆసక్తి ఉండదు. అందుకే లుక్‌ని దాచడం చాలా చాలా ఇంపార్టెంట్‌. దాన్ని దృష్టిలో పెట్టుకునే అనుష్క లుక్‌ని దాచేస్తున్నారట మేకర్స్.రీసెంట్‌గా కృష్ణంరాజు చనిపోయినప్పుడు కూడా అనుష్క ఆ దరిదాపుల్లో కనిపించలేదు.

అందుకు కారణం కూడా ఇదేనట. జనాల కళ్లకు కనిపించకుండా, హాస్పిటల్‌కి వెళ్లి నివాళులు అర్పించి వెళ్లిపోయిందన్నది రెబల్‌స్టార్‌ ఫ్యాన్స్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట.కెరీర్‌ పీక్స్ మీదుండగా సైజ్‌ జీరో సినిమా సైన్‌ చేసింది అనుష్క. ఆ సినిమా కోసం దాదాపు 20 కిలోల బరువు పెరిగింది. ఆ తర్వాత బాహుబలి కోసం, భాగమతి కోసం తగ్గే ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత కష్టపడి బాగానే తగ్గింది. అయినా ఇప్పుడు మహేష్‌.పి కథ డిమాండ్‌ చేయడంతో మళ్లీ రిస్క్ చేసి బరువు పెరిగిందట.ఇప్పుడు చేసే సినిమా అరుంధతి కైండ్‌ మూవీ అవుతుందన్నది టాక్‌. ఆ విషయాన్ని సింబాలిక్‌గా చెబుతూ తన డీపీని అరుంధతి పిక్‌తో అనుష్క రీప్లేస్‌ చేసిందనే మాట వైరల్‌ అవుతోంది. మహేష్‌ డైరక్ట్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌ రిలీజైతే తప్ప అందులో నిజానిజాలు తెలిసే అవకాశం లేదు.

, , , , ,