ad

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఈ పేరును దాదాపు అందరు మర్చిపోయారు. కానీ అమ్మడు మాత్రం బాలీవుడ్ బాజా మోగిస్తోంది. తెలుగులో టాప్ హీరోలందరితోను వర్క్ చేసిన రకుల్ ఆ మధ్య నాగార్జున తో చేసిన మన్మథుడు2 తో దెబ్బతిన్నది. అంతకు ముందే వరుసగా కొన్ని ప్లాప్స్ ఉన్నాయి. దీనికి తోడు సీనియర్ హీరోతో రొమాన్స్ బెడిసికొట్టింది. తరవాత తనను ఇక్కడ ఇంకెవరు పట్టించుకోలేదు. బట్ తాను మరీ ఎం ఫీల్ అవలేదు. అందుకు కారణం బాలీవుడ్ ఆఫర్స్. మాములుగా తనకు అక్కడ అజయ్ దేవ్ గణ్ ఎక్కువగా ఆఫర్స్ ఇస్తుంటాడు. అతని సినిమాల్లో రకుల్ కూడా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంది. దీంతో బాలీవుడ్ లో కాస్త క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తోనే ఈ ఏడాది ఏకంగా రకుల్ నటించిన ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
అజయ్ దేవ్ గణ్ తో రెండు అక్షయ్ కుమార్ తో రెండు సినిమాలున్నాయి రకుల్ కి. అజయ్ తో చేస్తోన్న సినిమాలు రన్ వే 34, థాంక్ గాడ్ చిత్రాలున్నాయి. రన్ వే లో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. థాంక్ గాడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా ఉన్నాడు. ఐన తాను అజయ్ కె జంటగా నటిచింది. వీటితో పాటు మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న ఆయుష్మాన్ ఖురానా తో డాక్టర్ జి అనే మూవీ ఉంది. అక్షయ్  తో నటించే మూవీ కి కాక  టైటిల్ పెట్టలేదు. ఇవి కాక ఈ ఏడాదే విడుదలయ్యే సినిమాలు చత్రివాలి, సైన్స్ ఫిక్షన్ గా వస్తోన్న అట్టాక్ అనే సినిమా ఉంది.
టోటల్ గా ఏడు సినిమాలతో ఎంత బిజీ గా ఉందొ అర్థమవుతోంది కదా. ఇంకా తనకి టాలీవుడ్ లేదా కోలీవుడ్ ఆఫర్స్ రావడం లేదు అని ఎందుకు ఫిల్ అవుతుంది ఇంకా. ఏదేమైనా సౌత్ లో వచ్చిన స్టార్డామ్ తోనే రకుల్ కు ఇన్ని హిందీ ఆఫర్స్ వచ్చాయనేది నిజం. మరి ఈ ఏడు మూవీస్ తర్వాత ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతుంది అనే వార్తలు కూడా ఉన్నాయి. వేస్తుందా లేక మరో ఏడు చిత్రాలు చేస్తుందా అనేది చూడాలి.

, , , , , , , , , , , , , , , , ,