యాంకర్ – మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. వరుసగా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి నటించిన భారీ, క్రేజీ మూవీ ఆచార్య. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ మూవీ అన్ని అడ్డంకులను దాటుకుని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి న్యూమూవీ టైటిల్ ఇదే అంటూ ఓ ఓ పవర్ ఫుల్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.
ఇంతకీ విషయం ఏంటంటే… చిరంజీవి ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు. అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో ఓ భారీ చిత్రం చేసేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించడం కూడా జరిగింది. ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ఒక సాలిడ్ టైటిల్ ని మేకర్స్ పెడుతున్నారని కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అలా ప్రచారంలోకి వచ్చిన టైటిల్స్ లో వాల్తేరు వీరయ్య అనే టైటిల్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాదాపుగా ఈ టైటిల్ నే కన్ ఫర్మ్ అనుకున్నారు.