Advertisement
“ఆర్ఆర్ఆర్” సెన్సార్ రివ్యూ ఇదే
Latest Movies Tollywood

“ఆర్ఆర్ఆర్” సెన్సార్ రివ్యూ ఇదే

Advertisement

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రాన్ని దాదాపు 450 కోట్ల భారీ బ‌డ్జెట్ తో డివివి దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. క‌రోనా కార‌ణంగా వాయిదాప‌డుతూ వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. క‌రోనా థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా మ‌రోసారి వాయిదా ప‌డింది.

దీంతో సినీ అభిమానులు అంద‌రూ నిరాశచెందారు. అయినప్పటికీ… ఈ సినిమా విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని ముగించారు. టీజర్స్, ట్రైలర్ తో అంచనాల్ని ఓ రేంజ్ లో పెంచేసిన ఈ సినిమాకి సంబంధించి తాజాగా మరో అంకం పూర్తయింది. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. దీనికి ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేశారో తెలియదు కానీ.. సెన్సార్ రివ్యూ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అయిన ఉమైర్ సంధు ఆర్.ఆర్.ఆర్ సెన్సార్ రివ్యూను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేశారు. మైండ్ బ్లోయింగ్.. జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్.. ఇద్దరూ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటూ.. ఫైర్ ఎమోజీని షేర్ చేశారు. అలాగే.. దంగల్, బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని కూడా తెలిపారు. దీంతో అభిమానులు సినిమా విడుదలకు సంబంధించిన అప్ డేట్స్ గురించి ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. మరి… ఉమైర్ సంధు చెప్పినట్టుగా ఆర్ఆర్ఆర్ బాహుబ‌లి 2 రికార్డుల‌ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

Advertisement