మెగా కాంపౌండ్ అయిన అల్లు అర‌వింద్ ఆహా కోసం నంద‌మూరి బాల‌కృష్ణ అన్ స్టాప‌బుల్ అంటూ టాక్ షో చేయ‌డం ఓ సంచ‌ల‌నం అయితే.. ఈ టాక్ షో సూప‌ర్ స‌క్స‌స్ అవ్వ‌డం మ‌రో సంచ‌ల‌నం. అయితే.. బాల‌య్య ఈ టాక్ షో చేస్తార‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఫ‌స్ట్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వ‌స్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. చిరును బాల‌య్య ఎలాంటి ప్ర‌శ్న‌లు అడ‌గ‌నున్నారు.? వాళ్లిద్ద‌రి మ‌ధ్య మాట‌ల్లో ఎలాంటి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి..? అని అటు మెగా అభిమానులు ఇటు నంద‌మూరి అభిమానులు ఆతృత‌గా ఎదురు చూశారు.

అయితే.. ఫ‌స్ట్ ఎపిసోడ్ ను క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుతో చేయ‌డం జ‌రిగింది. మ‌రి.. లాస్ట్ ఎపిసోడ్ అయినా చిరంజీవితో చేసి ఎండ్ చేస్తార‌నుకుంటే… మ‌హేష్ బాబుతో చేయ‌డం జ‌రిగింది. దీంతో చిరంజీవిని ఎందుకు ఈ షోకు గెస్ట్ గా రాలేదు అనేది ఆస‌క్తిగా మారింది. దీని గురించి షో లో ప్రధాన బాధ్యతలను నిర్వర్తించిన బీవీయస్ రవి వివరణ ఇచ్చారు. ఇంత‌కీ బివీయ‌స్ ర‌వి ఏం చెప్పారంటే.. అప్పటికే సమంత నిర్వహించిన సామ్ జామ్ టాక్ షో కు చిరంజీవి పాల్గొన్నప్పటికీ.. మరోసారి ఆయన్ని బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లోనూ పార్టిసిపేట్ చేయించాలని తామంతా గట్టిగా అనుకున్నామని అన్నారు.

అయితే… రెండు ఎపిసోడ్స్ పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ భుజానికి ఆపరేషన్ జరగడంతో కొన్ని వారాలు షో కు, షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ సమయంలో నిజానికి చిరంజీవి డేట్స్ ఇచ్చారని, కానీ వాటిని తాము ఉపయోగించుకోలేక పోయామని బివీయ‌స్ ర‌వి అన్నారు. ఆ తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్, భోళాశంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రాల షూటింగ్స్ మొదలు కావడంతో చిరంజీవి టైమ్ ఇవ్వలేకపోయారని చెప్పారు. అయితే.. అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ లో బాలకృష్ణ – చిరంజీవి కాంబో లో స్పెషల్ ఎపిసోడ్ చేయాలని తాను కోరుకుంటున్నానని బీవీయస్ రవి అన్నారు. మ‌రి.. సెకండ్ సీజ‌న్ లో అయినా చిరు, బాల‌య్యల అన్ స్టాప‌బుల్ ఎపిసోడ్ వ‌స్తుద‌ని ఆశిద్దాం.

, , , , , , , , , , , , ,