Advertisement
థర్డ్ వేవ్ తడాఖా.. మారిన రిలీజ్ డేట్స్  తో టాలీవుడ్ తంటా
Latest Movies Tollywood

థర్డ్ వేవ్ తడాఖా.. మారిన రిలీజ్ డేట్స్  తో టాలీవుడ్ తంటా

Advertisement

కరోనా కారణంగా టాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాల రిలీజ్ లు ఆగిపోయాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ సినిమాలన్నీ ఎప్పుడు ధియేటర్లలోకి వస్తాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కానీ ఆ చిత్రాల మేకర్స్ రిలీజ్ ప్లాన్ లు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. అవును ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రకారం థర్డ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ అయిన కొన్ని పెద్ద చిత్రాలకు మళ్ళీ కొత్త రిలీజ్ డేట్స్ ని లాక్ చేశారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలేంటీ.. మారిన, మార్చుకున్న రిలీజ్ డేట్స్ ఏంటీ..?
థర్డ్ వేవ్ ప్రభావం పెరగడానికి ముందే తమ సినిమాలను రిలీజ్ చేసి సూపర్ హిట్స్ కొట్టారు కొంత మంది మేకర్స్. ఆ లిస్ట్ లో బాలయ్య అఖండ, అల్లు అర్జున్ పుష్ప, నాని శ్యామ్ సింగరాయ్ చిత్రాలున్నాయి. కానీ సంక్రాంతి టార్గెట్ గా ప్లాన్ చేసుకున్న పాన్ ఇండియా చిత్రాలతో పాటు మరో భారీ చిత్రం కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా వెనక్కి తగ్గక తప్పలేదు. దీంతో అలా వాయిదా పడిన చిత్రాలకు మళ్ళీ కొత్త రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకుంటున్నారు.
ఖచ్చితంగా సంక్రాంతికే రావాలని పట్టుబట్టిన భీమ్లా నాయక్ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్, రాదేశ్యామ్ కారణంగా ఫిబ్రవరి 25కి పోస్ట్ పోన్ చేశారు. కానీ కోవిడ్ కోసులు పెరగడంతో సంక్రాంతికి రావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ను ఫిబ్రవరి 25కే రిలీజ్ చేస్తామని సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ లోనూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ అది థర్డ్ వేవ్ లో కేసులు ఇంకా పెరిగితే భీమ్లా నాయక్ ని మళ్ళీ వాయిదా వేయక తప్పదు.
సంక్రాంతి సినిమాలతో పోటీ పడటం ఇష్టం లేక… మెగాస్టార్ చిరంజీవి ముందుగానే తమ సినిమా ఆచార్యని ఫిబ్రవరి 4కి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ టైమ్ కి ఆచార్యని రిలీజ్ చేయడం కుదరనిపిని. అందుకే మేకర్స్ కూడా ఆచార్యని ఏప్రల్ కి పోస్ట్ పోన్ చేసినట్లు సంక్రాంతి సందర్భంగా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. అంటే కొరటలా శివ, చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన ఆచార్య ఏప్రిల్ 1న విడుదలకాబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కి భారీ హైప్ తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు కూడా కోవిడ్ వల్ల మళ్ళీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలకు మళ్ళీ కొత్త రిలీజ్ డేట్స్ ని లాక్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాని మార్చి 18న విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ డేట్ ని ముందుగానే లాక్ చేసిపెట్టారు మేకర్స్. న్యూ లవ్ స్టోరీతో తెరకెక్కిన రాదేశ్యామ్ పై నేషనల్ వైడ్ గా అంచనాలున్నాయి.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ని సెట్ చేసుకుంటున్నారు. మూడేళ్ళ క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకపోవడానికి కారణం కోవిడ్. ఇప్పడు థర్డ్ వేవ్ ప్రభావం ఆ సినిమా మీద చాలా గట్టిగా పడింది. సంక్రాంతికి పక్కా వస్తుందనే నమ్మకంతో మేకర్స్ కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ థర్డ్ వేవ్ వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడంతో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఖర్చుపెట్టిన కోట్లన్ని వృధా అయినట్లే. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 29న ఆర్ఆర్ఆర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు…తన సర్కారు వారి పాట చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ కోసమే ఏప్రిల్ 1కి వాయిదా వేసుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ చిత్రాల డేట్స్ అడ్జెస్ట్ మెంట్స్ వల్ల సర్కారు వారి పాట ఏప్రిల్ 1న రావడం కష్టమే. పైగా మహేష్ హెల్త్ ఇష్య్టూతో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ కారణంగా సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ కావడానికి మరింత టైమ్ పడుతుంది. అందుకే ఈ సినిమాని మే నెలలో 13వ తేదీన రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఏప్రిల్ నెలలో 14వ తేదీన కెజిఎఫ్ సెకండ్ పార్ట్ వస్తున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ సాధించిన విజయం కారణంగా సెకండ్ పార్ట్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. థర్డ్ వేవ్ ని ముందుగానే ఊహించినట్లుగా ఈ చిత్రాన్ని చాలా రోజుల క్రితమే ఏప్రిల్ 14న రిలీజ్ అంటూ ప్రకటించారు. రీసెంట్ గా మళ్ళీ కన్ ఫామ్ చేశారు. అవ్వడానికి ఇది కన్నడ సినిమానే అయినప్పటికీ తెలుగులోనూ క్రేజ్ ఉంది. అందుకే మన మేకర్స్ కూడా ఆ డేట్ ని వదిలేశారు. పెద్ద చిత్రాల రిలీజ్ డేట్స్ అన్నీ మారడంతో ఆల్ రెడీ ఆ డైట్స్ లో రావాలనుకుంటున్న మీడియం బెడ్జెట్ చిత్రాల రిలీజ్ డేట్స్ కూడా మారాల్సి ఉంది. ఈలిస్ట్ లో ఎఫ్3 ఉంది. నిజానికి ఇది భీమ్లానాయక్ కోసం ఫిబ్రవరి 25నుంచి తప్పుకుని ఏప్రిల్ 29కి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ డేట్ కి ఆర్ఆర్ఆర్ వస్తే కనుక…ఎఫ్3 కోసం మరో డేట్ ను చూడాల్సి ఉంటుంది. అలాగే రవితేజ నటిస్తున్న రెండు కొత్త సినిమాల డేట్స్, వరుణ్ తేజ్ గని చిత్రం డేట్..ఇలాంటి చిత్రాలకు మళ్ళీ కొత్త డేట్స్ ని సెట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇదంతా అనుకున్నట్లుగా జరగాలంటే కరోనా థర్డ్ వేవ్ కంట్రోల్ అయితేనే సాధ్యమవుతుంది. లేదంటే ఈ చిత్రాలన్నీ మళ్ళీ వాయిదా పడక తప్పదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement