Advertisement
SOUTH HEROES:- ఇండియా మొత్తం ఈ సౌత్ సినిమాల కోసమే చూస్తోంది..?
Latest Movies Tollywood

SOUTH HEROES:- ఇండియా మొత్తం ఈ సౌత్ సినిమాల కోసమే చూస్తోంది..?

Advertisement
ఇండియన్ సినిమా అంటే ఇప్పుడు సౌత్ సినిమానే. బాహుబలి కంటే ముందు నుంచే మనవాళ్లు బాలీవుడ్ ను డామినేట్ చేస్తున్నారు. కానీ బాహుబలి సునామీలా పడి ఇండియన్ సినిమాక సిసలైన మీనింగ్ చెప్పింది. దీన్ని కంటిన్యూ చేస్తూ కెజీఎఫ్ సైతం దేశం మొత్తం ఊపేసింది. అందుకే ఇప్పుడు నార్త్ ఆడియన్సెస్ వాళ్ల సినిమాల కంటే మన సినిమాలపైనే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. మరి కంట్రీ మొత్తాన్ని షేక్ చేయబోతోన్న ఆ తెలుగు సినిమాలేంటీ.. ఎప్పుడు రాబోతున్నాయో చూద్దాం..
బాహుబలి లాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా ఊహించలేదు. ఆ మాటకొస్తే దేశం లో ఎవరూ ఊహించలేదు. ఇప్పటి వరకూ అలాంటి చిత్రాలు హాలీవుడ్ నుంచి వస్తే అబ్బురపడ్డాం తప్ప మనవాళ్లు ఇలాంటి సినిమా ఎప్పుడు చేస్తారా అని కూడా అనుకోలేదు. బట్ రాజమౌళి చేసి చూపించాడు. అప్పటికే మగధీర, ఈగ చిత్రాలతో దేశాన్ని ఆకట్టుకున్న అతను ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా బాహుబలిని మలిచాడు. అందుకే ఇప్పుడు అతన్నుంచి సినిమా వస్తోందంటే తెలుగు ప్రేక్షకులే కాదు.. వాల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ ఆడియన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అలాంటిది ఇద్దరు టాప్ తెలుగు యాక్టర్స్ తో మల్టీస్టారర్ చేస్తే అంచనాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాలా..?
ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం తగ్గించేదే లేదు అన్నట్టుగా ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు. కాకపోతే అనూహ్యంగా చిత్రం వాయిదా పడాల్సి వచ్చింది. అయితే కొత్త డేట్ గా మార్చి 18ని అనౌన్స్ చేశారు మేకర్స్. అది కాకపోతే ఏప్రిల్ 28. ఈ రెండు డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. బట్ ఎప్పుడు వచ్చినా అనేక రికార్డులు కనుమరుగు కావడం ఖాయం అనేది వాస్తవం.
ఇక అనూహ్యంగా వచ్చిన అందరినీ మెప్పించిన సినిమా కెజీఎఫ్. కన్నడ సినిమా అంటే మామూలుగా సౌత్ లోనే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అలాంటిది కంట్రీ మొత్తాన్ని మెస్మరైజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ప్రశాంత్ నీల్ చేసిన మ్యాజిక్ కు దేశం మొత్తం దాసోహం అంది. అప్పటి వరకూ కేవలం ప్రాంతీయ సినిమాగానే కెజీఎఫ్ ను చూడాలనుకున్నారు. ఎప్పుడైతే ప్యాన్ ఇండియన్ పిక్చర్ గా విడుదల చేశారో.. భాషాభేదం లేకుండా బలే చూశారు ప్రేక్షకులు. అటు అమెజాన్ లోనూ అత్యధికులు చూసిని సినిమాగానూ రికార్డ్ క్రియేట్ చేసింది కెజీఎఫ్. అలాంటి కెజీఎఫ్ కు సీక్వెల్ వస్తుందంటే ఇంక ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయి. యస్.. మేకర్స్ అనుకున్నదానికంటే ఎక్కువగానే అంచనాలున్నాయి. వాటిని అందుకోవడం తమకేమంత పెద్ద కష్టం కాదని నిరూపిస్తూ.. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ మరో బ్లాక్ బస్టర్ ఖాయం అని భావించేలా చేసింది. పైగా ఈ సారి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటించాడు. రవీనాటాండన్ ఓ కీలక పాత్ర చేసింది. దీంతో పాటు మరెన్నో ప్రత్యేకతలతో కెజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. విశేషం ఏంటంటే.. ఆ మధ్య బాలీవుడ్ లో ఓ సర్వే పెట్టి అక్కడి టాప్ బిగ్ మూవీస్ లో కెజీఎఫ్ ను చేర్చారు. వీటిలో ఏ చిత్రం చూడాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ ప్లేస్ కెజీఎఫ్ కే ఇచ్చారు అక్కడి ఆడియన్స్. అలాంటి ఈ రెండో చాప్టర్ ఈ సారి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో..
బాహుబలితో కంట్రీ మొత్తం ఫేవరెట్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. అందుకే అతను తర్వాత చేసిన సాహో చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్ల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ప్రభాస్ ను తమ వాడిగానే భావిస్తున్నారు. అలాంటి డార్లింగ్ స్టార్ రాధేశ్యామ్ తో వస్తున్నాడనగానే అంతే స్థాయిలో అంచనాలు పెంచుకుంటున్నారు. ఇక ఈ సినిమా మార్చి 11న విడుదల కాబోతోంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన రాధేశ్యామ్ మూవీ ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయనేది నిజం. రాధేశ్యామ్ తో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న సలార్ పైనా దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.
వీరితో పాటు ఈ లిస్ట్ లో ఉన్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ కంట్రీ మొత్తం ఫేమ్ అయ్యాడు. ఈ మూవీ తెలుగులోనే వచ్చినా.. డబ్బింగ్ వెర్షన్ లో చూసిన వారంతా విజయ్ కి అభిమానులయ్యారు. పైగా అతని యాటిట్యూడ్ బాలీవుడ్ కు బాగా నచ్చింది. అందుకే కరణ్ జోహార్ లాంటి టాప్ ప్రొడ్యూసర్ కూడా అతని కొత్త సినిమా లైగర్ లో భాగస్వామి అయ్యాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ చిత్రంలో మైక్ టైసన్ మరో మెయిన్ రోల్ చేశాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఆగస్ట్ లో విడుదల కాబోతోన్న లైగర్ కోసం కూడా బాలీవుడ్ ఈగర్ గా ఎదురుచూస్తోంది.
మొత్తంగా ఇప్పుడు కంట్రీని శాసిస్తున్నది సౌత్ సినిమాలే కావడం విశేషం. అందులో ప్రధానమైన చిత్రాలన్నీ తెలుగువే కావడం మరో విశేషం. మరి ఈ టఫ్ కాంపిటీషన్ ను ఫేస్ చేసేందుకు బాలీవుడ్ ఇంకెన్ని బలమైన కథలతో వస్తుందో కానీ.. ప్రస్తుతానికైతే.. ఈ సినిమాల కోసమే చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారనేది నిజం. మరి వీటిలో బాక్సాఫీస్ ను షేక్ చేయడంలో ఒక సినిమాను మించి మరో సినిమా కనిపిస్తోంది. అయినా అల్టిమేట్ గా అందరికంటే బెస్ట్ అనిపించుకునేదెవరో చూడాలి.

Advertisement