ad

బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ రేంజే మారిపోయింది. బాహుబ‌లి సినిమా 1000 కోట్లు క‌లెక్ట్ చేసిన తొలి భార‌తీయ సినిమాగా చ‌రిత్ర సృష్టించింది. దీంతో ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెరిగింది. మ‌న దేశంలోనే కాదు వేరే దేశాల్లో కూడా ప్ర‌భాస్ కు అభిమానులు ఉన్నారంటే… బాహుబ‌లి ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో అర్థం చేసుకోవ‌చ్చు. బాహుబ‌లితో వ‌చ్చిన ఇమేజ్ కు త‌గ్గ‌ట్టుగా ప్ర‌భాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ… కెరీర్ లో దూసుకెళుతున్నాడు. రాధేశ్యామ్, స‌లార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్… ఇలా వ‌రుస‌గా పాన్ ఇండియా మూవీస్ లైన‌ప్ సెట్ చేసుకున్నాడు ప్ర‌భాస్.

ఈ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్స్ క్యూక‌డుతున్నారు. రెమ్యూన‌రేష‌న్ ఎంతైనా ఇస్తాం.. మా బ్యాన‌ర్ లో సినిమా చేయండి అంటూ ప్ర‌భాస్ పై ఒత్తిడి తీసుకువ‌స్తున్నార‌ట‌. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్స్ లో ఒక‌రైన ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ డివివి దాన‌య్య ప్ర‌భాస్ తో సినిమా చేసేందుకు గాను 50 కోట్ల అడ్వాన్స్ ఇచ్చార‌ట‌. ఇక రెమ్యూన‌రేష‌న్ 100 కోట్లు. ఈ డీల్ కార‌ణంగానే ప్ర‌భాస్ దాన‌య్య బ్యాన‌ర్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పార‌ని టాలీవుడ్ లో బ‌లంగా టాక్ వినిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా లాభాలను నిర్మాత దానయ్య అడ్వాన్స్ లు గా మారుస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్ర‌భాస్ కి 50 కోట్లు అడ్వాన్స్ ఇచ్చార‌ని… అలాగే ఇద్దరు టాప్ మెగా హీరోలకు కూడా అడ్వాన్స్ లు ఇవ్వ‌నున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దాన‌య్య భారీగానే పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ లెక్క‌న దాన‌య్య బ్యాన‌ర్ లో ప్ర‌భాస్ సినిమా చేయ‌డం ఖాయం. అయితే… ఈ భారీ పాన్ ఇండియా మూవీకి డైరెక్ట‌ర్ ఎవ‌రో… క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

, , , , , , , , , , , , , , , , ,