Advertisement
రికార్డుల మోత‌మ్రోగిస్తున్న “ఆర్ఆర్ఆర్” ట్రైల‌ర్
Bollywood Latest Movies Regional Tollywood

రికార్డుల మోత‌మ్రోగిస్తున్న “ఆర్ఆర్ఆర్” ట్రైల‌ర్

Advertisement

దేశం మొత్తం ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ ట్రైల‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుక‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దాన‌య్య ఈ చిత్రాన్ని దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే.. ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూసిన‌ ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ యూట్యూబ్ లో రికార్డుల మోత మ్రోగిస్తుంది.

ఆర్ఆర్ఆర్.. తెలుగు వెర్షన్ విష‌యానికి వస్తే మాత్రం.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ అభిమానులు నెవర్ బెఫోర్ ఫాస్టెస్ట్ రికార్డ్ సెట్ చేసి పెట్టారు. కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ ట్రైలర్ గా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ని ఆల్ టైం నెంబర్ 1 ప్లేస్ లో నిల‌బెట్టారు. అలాగే ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్ కి దగ్గరగా కూడా ఈ ట్రైలర్ ఉంది. ఇక హిందీ వెర్ష‌న్ ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. బాలీవుడ్ జనాలు కూడా తెలుగుతో సమానమైన రెస్పాన్స్ ఈ ట్రైలర్ కి ఇస్తున్నారు.

అల్రెడీ 17 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి బాలీవుడ్ లో కూడా భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. రికార్డ్ వ్యూస్ దిశ‌గా దూసుకెళుతుంది. మొత్తానికి మాత్రం అందరి అంచనాలు రీచ్ అయ్యి ట్రైలర్ తో సినిమా ఇంకో స్థాయికి వెళ్ళింది. ఇప్ప‌టి వ‌ర‌కు బాహుబ‌లి రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేస్తుందా..? లేదా..? అనే డౌట్ ఉండేది. అయితే.. ట్ర‌ల‌ర్ రిలీజ్ త‌ర్వాత బాహుబ‌లి రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేయ‌డం ఖాయం అని అంటున్నారు సినీజ‌నాలు.

Advertisement