నారీ నారీ నడుమ మురారి అంటే ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అలాగే.. ఒక రాధ ఇద్దరు కృష్ణులు అన్నప్పుడూ వినోదం పంచారు. కానీ ఇప్పుడు ఇద్దరు హీరోలు.. ఒక హీరోయిన్ గా మారింది సిట్యుయేషన్. అలాగని ఇక్కడా ఎంటర్టైన్మెంట్ వస్తుంది.

బట్.. ఇందుకోసం ఒక హీరోయిన్ ఇబ్బంది పడక తప్పని పరిస్థితి వచ్చింది. యస్.. ఆ స్టార్స్ మధ్య సదరు హీరోయిన్ నలిగిపోతోంది. ఎవరి గురించి ఏం చెబితే ఏ తంటా వస్తుందో అని పాపం తెగ ఫీలైపోతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గెస్ చేశారా..? యస్ శ్రుతి హాసన్. మెగా, నందమూరి హీరోల మధ్య సంక్రాంతికి వస్తున్నాన్న ఆనందం కూడా లేక బాధపడుతోందట ఈ భామ.


ఏ హీరోయిన్ అయినా ఎక్కువమంది హీరోలతో నటించడం కామన్. అది మామూలుగా జరిగేదే. అయితే ఆ హీరోల సినిమాలు ఒకే సారి రిలీజ అవుతుంటే మాత్రం అమ్మడికి ఇబ్బంది తప్పదు. ప్రస్తుతం శ్రుతి హాసన్ ఇలాంటి ఇబ్బందినే ఫేస్ చేస్తోంది. తను బాలకృష్ణతో నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలవుతోంది. ఈ మూవీలో తన పాత్రకుమంచి ప్రాధాన్యతే ఉంటుందని చెబుతున్నారు.

పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. బాలయ్య సరసన శ్రుతి హాసన్ తో పాటు మరో పాత్రకు మళయాల బ్యూటీ హనీరోజ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో తనకు ఓ పెద్ద ప్రాబ్లమ్ ఎదురు కాబోతోంది. ఆ ప్రాబ్లమ్ పేరు వాల్తేర్ వీరయ్య.


మెగాస్టార్ తో శ్రుతి హాసన్ నటించిన సినిమా వాల్తేర్ వీరయ్య కూడా సంక్రాంతి బరిలోనే జనవరి 13న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఖైదీ నెంబర్ 150, గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వార్ కు సిద్ధమయ్యారు. పైగా ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

అది ఖచ్చితంగా ప్రమోషన్స్ లో శ్రుతి హాసన్ ను ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. అందుకే ఒప్పుకునేటప్పుడు అనుకోలేదు కానీ.. ఇప్పుడు మాత్రం తెగ ఫీలవుతోందట శ్రుతి హాసన్. ఇద్దరూ టాప్ హీరోలే. ఇద్దరి చిత్రాల్లో తనే హీరోయిన్ కావడం వల్ల సమస్య తప్పదు. మరి ఈ సమస్య నుంచి తను ఎలా బయటపడుతుందో కానీ.. ఇద్దరు హీరోల మధ్య నలిగిపోతోందీ బ్యూటీ ఇప్పుడు.

, , , , , , , , , , , , , , , , , ,