కొన్నాళ్లుగా కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ చూస్తోన్న సీనియర్ హీరో నాగార్జున ఈ సారి కొంచెం గ్యాప్ తీసుకుని మంచి కథతోనే రావాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ప్రవీణ్‌ సత్తారు చెప్పిన కథకు ఓకే అయ్యాడు. అంతకు ముందు తను ఎంతో నమ్మకంతో చేసిన వైల్డ్ డాగ్ థియేటర్స్ లో పోయింది. బట్ ఓటిటిల్లో మాత్రం సత్తా చాటింది. దీంతో మరోసారి ఆ మూవీ కాన్సెప్ట్ లోనే ఎన్ఐఏ ఆఫీసర్ కథతో వస్తున్నాడు. అదే ప్రవీణ్‌ సత్తారు సినిమా. ఇటు ప్రవీణ్‌ కూడా ఇంతకు ముందు గరుడవేగ సినిమాలోనూ ఇదే కాన్సెప్ట్ తో విజయం సాధించాడు. అలా అన్నీ సింక్ అయ్యాయో లేక ఇది కూడా ఓ మంచి కథ కావడం వల్లో కానీ నాగ్, ప్రవీణ్‌ కాంబోలో ఏసియన్ సునిల్, పుష్కర్ రామ్ మోహన్, శరత్ మరార్ నిర్మాతలుగా ఈ ఘోస్ట్ చిత్ర మొదలైంది. మధ్యలో కరోనా వంటి కారణాలతో అనుకున్నట్టుగా షూటింగ్ సాగలేదు. కాస్త ఆలస్యం అయినా లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. ఈ మేరకు టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదల కాబోతోన్న ఘోస్ట్ లో నాగ్ తో పాటు గుల్ పనాగ్, సోనాల్ చౌహాన్, అనిఖా సురేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ రిలీజ్ చేసిన చిన్న వీడియో గ్లింప్ ఆకట్టుకుంది. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే ఉంది. ఆ టైమ్ కు ఏదైనా టీజర్ లాంటివి విడుదల చేయొచ్చు. మొత్తంగా విడుదలకు చాలా టైమ్ ఉంది కాబట్టి.. బలమైన ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తే సినిమా హిట్ అవడం పెద్ద మేటర్ కాదు. అఫ్ కోర్స్ సినిమాలో కూడా మేటర్ ఉండాలి..

, , , , , , ,