Advertisement
 పేరులో ఉన్న శౌర్యం కథల ఎంపికలో కనిపించడం లేదు
Latest Movies Tollywood

 పేరులో ఉన్న శౌర్యం కథల ఎంపికలో కనిపించడం లేదు

Advertisement

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోస్ లో నాగచైతన్య ఒకడు. స్వయంకృషితో ఎదిగే ప్రయత్నం చేస్తున్న హీరో అతను. అయితే ఈ ప్రయత్నం ఎన్నాళ్లుగానో సా..గుతోంది తప్ప పనవడం లేదు. పైగా సొంతంగా బ్యానర్ పెట్టుకుని మరీ ట్రై చేసినా ఆ ఒక్క హిట్ తప్ప మరేదీ లేదు. అంతకు ముందు చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా వంటి ఫీల్ గుడ్ మూవీస్ తో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాతే ట్రాక్ తప్పాడు. కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నించి భంగపడ్డాడు. దిక్కులు చూడకు రామయ్యా తర్వాత అతనికి మరో హిట్ రావడానికి మూడు సినిమాల టైమ్ పడితే.. ఆ తర్వాత సొంతంగా బ్యానర్ పెట్టి చేసిన ఛలో కు ముందు నాలుగు ఫ్లాపులున్నాయి. ఛలో తర్వాత ఇప్పుడు వరుసగా ఏడు ఫ్లాపులున్నాయి. ఫ్లాపులు అనేకంటే డిజాస్టర్స్ అంటే బెటరేమో. పైగా వీటిలో కూడా తన సొంత బ్యానర్ లో చేసినవి రెండు చిత్రాలున్నాయి. సితార వంటి ప్రామిసింగ్ బ్యానర్ లో చేసిన వరుడు కావలెను కూడా ఫ్లాప్ అనిపించుకుంటే.. లేటెస్ట్ గా వచ్చిన లక్ష్య గురి తప్పింది. అస్సలే మాత్రం ఆకట్టుకోలేకపోయిన స్పోర్ట్స్ డ్రామాగా తేలిపోయింది.
నాగశౌర్యకు అందం ఉంది టాలెంట్ కూడా ఫర్వాలేదు. కానీ కథల ఎంపికలోనే తడబడుతున్నాడు. ఎవరైనా సీనియర్స్ ను అడ్వైజర్స్ గా పెట్టుకున్న రాజ్ తరుణ్ వంటి వారు కూడా ఇదే సమస్యలో ఉన్నారు. కానీ తల్లితండ్రి సమక్షంలోనే కథలు వినే శౌర్య మాత్రం ఆ సమస్యను దాటలేకపోతున్నాడు. అసలు సమస్య ఎక్కడ ఉంది అనేది కనిపెట్టుకోవడం చాలా ముఖ్యంగా. ఇక్కడే అతను ఫెయిల్ అవుతున్నాడు. తన ఫేస్, ఫిజిక్, తన ఇమేజ్ కు తగ్గ కథల కంటే ఆ ఇమేజ్ ను మార్చాలనుకునే కథలకు ప్రాధాన్యం ఇవ్వడం అనవసరం. తను ఎలా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ ను గుర్తించడం లోనే శౌర్య ఫెయిల్ అవుతున్నాడు. దీనికి తోడు సినిమాలు చేస్తున్నప్పుడు దర్శకుల పనిలో ఎక్కువగా వేలు పెడతాడనే విమర్శ కూడా ఉంది.
ఏడు ఫ్లాపుల తర్వాత కూడా అతనికి ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. వీటిలో ఫలానా వారి అబ్బాయి ఫలానా వారి అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరికతో పాటు మరో పేరు పెట్టని చిత్రం. ఈ పేరు పెట్టని చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఏదేమైనా నాగశౌర్య ఇండస్ట్రీలో నిలబడాలంటే ఈ నాలుగు సినిమాల్లో కనీసం రెండైనా ఓ స్థాయిలో మెప్పించాలి. లేదంటే అతని కెరీర్ కు డేంజర్ బెల్స్ మోగుతాయి(ఇంకా మోగలేదా అంటే అది మీ ఇష్టం).

Advertisement