ఈ శుక్రవారం తెలుగు సినిమాకు గ్రేట్ న్యూస్ ఇచ్చింది. విడుదలైన సీతారామం, బింబిసార సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఎనిమిది వారాల తర్వాత వచ్చిన విజయం ఇది. కేవలం టాక్ మాత్రమే కాదు.. మనీ కూడా వచ్చేస్తుంది. రెండు నెలల తర్వాత థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. సో అంతా ఊహించినట్టుగా ఆగస్ట్ తెలుగు సినిమాకు ఆనందాలు తెచ్చింది. మరి ఈ రెండు సినిమాలేనా లేక ఈ నెలలో వస్తోన్న సినిమాలన్నీ ఇలాగే గూడ్ న్యూస్ చెబుతాయి.. అసలు ఈ నెలలో విడుదలవుతోన్న మేజర్ మూవీస్ ఏంటీ..? నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ నెల 12న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మించగా ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. నితిన్ యంగ్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నితిన్ చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ మాస్ సబ్జెక్ట్ తో వస్తున్నట్టు కనిపిస్తోంది. అంజలితో చేయించిన ఐటమ్ సాంగ్ కూడా మాస్ ను ఊపేస్తోంది. దీంతో మాచర్ల నియోజకవర్గంలో నితిన్ భారీ మెజారీటీతో బాక్సాఫీస్ ను గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నారు.

ఆగస్ట్ 13న నిఖిల్ నటించిన కార్తికేయ2 రాబోతోంది. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. 2014లో చందు దర్శకత్వంలోనే వచ్చిన కార్తికేయకు ఇది సీక్వెల్. అప్పట్లో యానిమల్ హిప్నాటిజం అంటూ ఓ కొత్త పాయింట్ తో ఆకట్టుకున్న ఈ టీమ్ ఈ సారి శ్రీ కృష్ణ జన్మస్థానమైన ద్వారక నేపథ్యంలో కథ చెప్పబోతున్నారు. ఇది అందరిలోనూ చాలా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకూ కేవలం టీజర్, ఒక్క పాటను మాత్రమే విడుదల చేశారు. ట్రైలర్ వస్తే మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. ఆల్రెడీ హిట్ సినిమాకు సీక్వెల్ తో వస్తున్నారు కాబట్టి కార్తికేయ2 కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉంది టీమ్.ఆమిర్ ఖాన్, కరీనాకపూర్ ఖాన్ జంటగా నటించిన లాల్ సింగ్ చడ్డాపైనా అంచనాలున్నాయి. నాగ చైతన్య ఓ చిన్న పాత్రలో కనిపించడం కూడా ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది. ఈ సినిమా 11నే విడుదలవుతోంది. అంటే ఒకే టైమ్ లో వస్తున్నా.. ఎవరూ ఫస్ట్ డే క్లాష్‌ లేకుండా చూసుకున్నారు. మరి ఈ హెల్దీ కాంపిటీషన్ వీరికి విజయాలను ఇస్తుందా లేదా అనేది చూడాలి.

ఆగస్ట్ 19న కూడా చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన తీస్ మార్ ఖాన్ తో పాటు మాటరాని మౌనమిది అనే మరో చిన్న సినిమా 19న విడుదల కాబోతున్నాయి. ఈ లిస్ట్ లోకి మరికొన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్ మాత్రం ఇంప్రెసివ్ గానే కనిపిస్తున్నాయి. కాస్త స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేసుకోగలిగితే.. ఖచ్చితంగా వీళ్లూ హిట్ టాక్ తెచ్చుకునే అవకాశం ఉంది.
ఇక ఆగస్ట్ కు గ్రాండ్ ఫినిషింగ్ ను మాత్రం క్రాస్ బ్రీడ్ సాలా లైగర్ ఇవ్వబోతున్నాడు. విజయ్ దేవరకొండ, అనన్య పాండ జంటగా నటించిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా వస్తోన్న లైగర్ పై ఇప్పటికే నార్త్ లో భారీ అంచనాలున్నాయి. అక్కడ విజయ్ దేవరకొండ క్రేజ్ కు సౌత్ వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. లేటెస్ట్ గా లైగర్ నుంచి రిలీజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ వైరల్ అవుతోంది. ఎలా చూసినా లైగర్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటే విజయ్ దేవరకొండకు ప్యాన్ ఇండియన్ మార్కెట్ కు తిరుగుండదు అనే చెప్పాలి. మరి ఆ రేంజ్ లో ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే ఆగస్ట్ ఆనందంగా ఎండ్ అయిపోతుంది. అలా కావాలనే మనమూ కోరుకుందాం.

, , , , , ,