ఇంటి పెద్ద పోతే.. ఇంటికి పెద్ద కొడుకే తలకొరివి పెట్టడం అనేది హిందూ సంప్రదాయం. కానీ కృష్ణంరాజు గారు చనిపోతే అంతా ప్రభాస్ తలకొరివి పెడతాడు అని భావించారు. కానీ అతను కాకుండా మరో సోదరుడు ప్రమోద్ చేత కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో చాలామంది ప్రభాస్ ఎందుకు చివరి క్రియలు జరిపించలేదు అనుకుంటున్నారు. అయితే దీని వెనక ఓ ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. ప్రభాస్ కావాలనే కృష్ణంరాజు గారికి తలకొరివి పెట్టలేదు అంటున్నారు. ఎందుకంటే ఎవరైనా వ్యక్తికి తలకొరివి పెడితే వాళ్లు ఆ వ్యక్తి దశ దిన కర్మలు అయ్యేంత వరకూ బయటకు రాకూడదు అంటారు. కానీ ప్రభాస్ ఆల్రెడీ రెండు మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.

వాటికి సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు తలికొరివి పెడితే ప్రభాస్ కూడా అన్ని రోజుల పాటు బయటకు రావడానికి లేదు. ఈ కారణంగానే ఆయన కృష్ణంరాజు అంత్య క్రియలు నిర్వహించలేదు అంటున్నారు.అంటే ఇప్పటికే ఆయా సినిమాలకు సంబంధించి ఇతర ఆర్టిస్టుల కాల్షీట్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్ వల్ల అవన్నీ ఆగిపోతే నిర్మాతకు నష్టం వస్తుందనే కారణంతోనే ప్రభాస్ ఇన్సియేషన్ తీసుకోలేదు అంటున్నారు. దీంతో పాటు మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది.

కృష్ణంరాజు గారికి అబ్బాయిలు లేరు. ఆయన మరణం తర్వాత జరగవల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. అవన్నీ చూసుకోవడం అంటే రోజూ బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే తను ముందుకు రాలేదు అంటున్నారు. ఏదేమైనా ప్రభాస్ ను హీరోగానే కాదు.. ప్యాన్ ఇండియన్ స్టార్ గా నిలబెట్టడంలో కృష్ణంరాజు గారి ఇన్సియేషన్ చాలానే ఉంది. ప్రతి విషయంలోనూ ఆయన అండగా నిలిచారు. అందుకే ప్రభాస్ కు పెదనాన్న అంటే ఎనలేని గౌరవం. అఫ్‌ కోర్స్ పెద్దలను గౌరవించడం ప్రభాస్ కు బ్లడ్ లోనే ఉందనుకోండి. కానీ పెదనాన్నపై వాత్సల్యం మాత్రం అమితంగా చూపిస్తారు. అలాంటి వ్యక్తి మరణించడం అంటే ప్రభాస్ కోలుకోవడానికి కాస్త టైమ్ పడుతుందనే చెప్పాలి

, , , ,