నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘బింబిసార’. ఫాంట‌సీ మూవీగా రూపొందిన ఈ చిత్రం క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా సినిమా ద‌క్కించుకుంది. ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంది. సినిమా రిలీజ్ కాక ముందుగానే ‘బింబిసార 2’ సినిమా చేయాల‌ని క‌ళ్యాణ్ రామ్.. వ‌శిష్ట్ అండ్ టీమ్ భావించారు. బ‌య‌ట‌కు కూడా చెప్పారు. బింబిసార హిట్ కావ‌టంతో వారి ఉత్సాహం రెట్టింపు అయ్యింది.

కాగా.. ‘బింబిసార 2’ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించాల‌ని క‌ళ్యాణ్ రామ్ భావిస్తున్నార‌ట‌. దీన్ని సీక్వెల్‌గా కాకుండా ప్రీక్వెల్‌గా తెర‌కెక్కించ‌బోతున్నార‌నే టాక్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. బింబిసార సినిమాను 5వ శ‌తాబ్దానికి వ‌ర్త‌మానానికి లింకు పెడుతూ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈసారి భూత‌కాలంలో.. వ‌ర్త‌మాన కాలంలో ఊగిస‌లాడేలా సినిమాను రూపొందించ‌నున్నార‌ట‌.

కొత్త‌గా ‘బింబిసార 2’లో రెండు పాత్ర‌లు యాడ్ కాబోతున్నాయి. అందులో ఓ రాక్ష‌సి పాత్ర కూడా ఉండ‌నుంది. ఆ రాక్ష‌సి పాత్ర‌లో ప్ర‌ముఖ హీరోయిన్ న‌టించ‌నుంద‌నే స‌మాచారం. అంటే క‌ళ్యాణ్ రామ్ హీరో అయితే నెగ‌టివ్ షేడ్‌ ఉన్న పాత్ర‌లో హీరోయిన్ క‌నిపించ‌నుంద‌ని టాక్‌. మ‌రి ఆ హీరోయిన్ ఎవ‌ర‌నేది తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.అయితే ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో మాత్రం ‘బింబిసార 2’పై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వశిష్ట్ మరో తనకు డైరెక్టర్‌గా లైఫ్ ఇచ్చిన సినిమాతోనే ద్వితీయ విఘ్నాన్ని దాటుతాడో లేదో చూడాలి.

, , , ,