రివ్యూ :- తగ్గేదేలే
తారాగణం :- నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్త, రవిశంకర్, రాజా రవీంద్ర, నాగబాబు తదితరులు ..
సంగీతం :- చరణ్‌ అర్జున్
ప్రొడ్యూసర్ :- ప్రేమకుమార్ పాండే, పవి సుబ్బారెడ్డి
దర్శకత్వం :- శ్రీనివాస్ రాజు

కథ :-

తగ్గేదేలే చిత్రాన్ని కథలా చూస్తే.. ఈశ్వర్(నవీన్ చంద్ర) ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. ఓ ప్రైవేట్ పార్టీలో లిజీ అనే అమ్మాయితో కలిసి రెండు రోజులు గడుపుతాడు. తర్వాత అతనికి పెళ్లవుతుంది. పెళ్లి తర్వాత లిజీ మళ్లీ అతని లైఫ్ లోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది. ఆ క్రమంలో ఓ రోజు తను మర్డర్ అవుతుంది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈశ్వర్ ను పోలీస్ లు ఓ ధాబా వద్దకు తీసుకువెళ్లి విచారిస్తుంటారు. ఈ క్రమంలో దండుపాళ్యం బ్యాచ్ జైలు నుంచి కోర్ట్ కు వెళ్లే దారిలో తప్పించుకుని ఇన్వెస్టిగేషన్ ఆఫసర్ ను చంపేందుకు వస్తారు. తర్వాతేమైందీ అంటే ఎవరైనా సులువుగానే ఊహించొచ్చు.సినిమా పోస్టర్స్ కూడా మోసం చేస్తాయి.. అనే మాట ఎప్పుడో కానీ వినం. పోస్టర్ లో కనిపించేది ఒకటి సినిమాలో ఉండేది మరోటి అన్న సందర్భాలు అత్యంత అరుదు. అలాంటి అరుదైన “కళాఖండమే” ఈ తగ్గేదేలే. అసలు ఇలాంటి చిత్రాలకు రివ్యూస్ రాయడం కూడా దండగే అనిపిస్తుంది.కానీ చూసే ప్రేక్షకులను కొందరినైనా కాపాడినట్టు అవుతుంది కదా అని రాయడమే. లేదంటే ఎప్పుడో ముగిసిపోయిన దండుపాళ్యంకు “క్లైమాక్స్” కోసం ఈ సినిమా తీస్తాడా దర్శకుడు. ఎంత దండుపాళ్యం తనకు ఇష్టమైన సినిమా అయితే మాత్రం దాన్ని జనంపై రుద్దడం మంచి మేకర్ చేసే పని కాదు.

మొత్తంగా దండుపాళ్యం క్లైమాక్స్ కోసం నవీన్ చంద్ర అనే పోస్టర్ వాల్యూను యాడ్ చేసి తగ్గేదేలే అంటూ ఆడియన్స్ ను అడ్డంగా బుక్ చేసిన సినిమా ఇది.నవీన్ చంద్ర జూనియర్ ఆర్టిస్ట్ లా మిగిలిపోయాడు. కానీ లిజీతో చేసిన రొమాన్స్ మాత్రమే అతనికి ఈ సినిమాకు వచ్చిన ప్లస్. సినిమా అంతా రవిశంకర్, అతని తమ్ముడు అయ్యప్ప డ్రగ్ డీలింగ్ తో ఉంటుంది. పేరుకు డ్రగ్స్ ను అరికట్టడం అనే పాయింట్ తీసుకున్నా.. దర్శకుడు మాత్రం దండుపాళ్యం బ్యాచ్ ను చంపడమే లక్ష్యంగా కథనం రాసుకున్నాడు. ఓ హత్య కేస్ లో అనుమానితుడిని ధాబాకు తీసుకువెళ్లి విచారించడం ఏంటనేది ఎంత జుత్తు పీక్కున్నా అర్థం కాదు.అసహజమైన పాత్రలు, అసంబద్ధమైన కథనం.. చెవులు చిల్లులు పడేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇవన్నీ నిమిష నిమిషానికి ఇరిటేషన్ పెంచుతూనే ఉంటాయి.ఇక క్లైమాక్స్ లో వచ్చిన దండుపాళ్యం బ్యాచ్ తో పోలీసాయన ఫైట్ చూస్తే దర్శకుడు గతంలో ఏదైనా మాంసం కొట్టులో పనిచేసిన అనుభవంతో ఈ సీక్వెన్స్ రాసుకున్నాడా అనిపిస్తుంది. మొత్తంగా తగ్గేదే లే దర్శకుడి సిల్లీ థాట్స్ నుంచి వచ్చిన సినిమా టైమ్ వేస్ట్ మూవీ.

ఫైనల్ గా :- తగ్గకపోతే పోతారు..

రేటింగ్ :-1/5

            - యశ్వంత్ బాబు
, , , , , , , ,