Advertisement
పాన్ ఇండియా సినిమాల‌కు మళ్లీ టెన్ష‌న్
Bollywood Latest Movies Regional Tollywood

పాన్ ఇండియా సినిమాల‌కు మళ్లీ టెన్ష‌న్

Advertisement

సంక్రాంతికి రానున్న సినిమాల విష‌యంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డం తెలిసిందే. అయితే.. ప‌వ‌ర్ స్టార్ భీమ్లా నాయ‌క్ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో టెన్ష‌న్ త‌గ్గిందని ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మేక‌ర్స్ హ్యాపీగా ఫీల‌య్యారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ డేట్ అండ్ థియేట‌ర్స్ ఫిక్స్ చేసుకుని లాక్ చేసుకున్నారు. అయితే.. నాగార్జున బంగార్రాజు సంక్రాంతికి రావ‌డం ఖాయం అంటున్నారు. అజిత్ వ‌లిమై కూడా సంక్రాంతికి వ‌స్తుంది అంటున్నారు. వీటితో సంక్రాంతికి వ‌చ్చే సినిమాలు నాలుగు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వీటికి థియేట‌ర్ల‌ను అడ్జెస్ట్ చేయ‌డం త‌ల‌కు మించిన భారంగా మారింది.

ఇప్పుడు ఈ నాలుగు సినిమాలే అనుకుంటే.. దుల్క‌ర్ స‌ల్మాన్ సెల్యూట్ కూడా జ‌న‌వ‌రి 14న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కేర‌ళ‌లో దీని ప్ర‌భావం చాలా ఎక్కువుగా ఉంటుంది. ఈ సినిమా తెలుగు వెర్సెన్ కూడా అదే తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ మూవీ తెలుగులో పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌చ్చు కానీ.. మ‌ల‌యాళంలో మాత్రం రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌కు షాక్ ఇవ్వ‌డం ఖాయం. ఎందుకంటే.. ఎక్క‌డైనా ప్రాంతీయ చిత్రాల‌కే ప్రాధాన్య‌త ఎక్కువుగా ఉంటుంది.

దీంతో ఈ పాన్ ఇండియా సినిమాల సంక్రాంతి పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఆర్ఆర్ఆర్ కోసం భీమ్లా నాయ‌క్ ని వాయిదా వేయించిన ప్రొడ్యూస‌ర్ గిల్డ్ వ‌లిమై, సెల్యూట్ చిత్రాల‌ను మాత్రం ఆప‌లేవు. అయితే.. రానున్న రోజుల్లో సౌతిండియా అంతా ఒక గిల్డ్ గా మారి రిలీజుల గురించి ఒక అండ‌ర్ స్టాండింగ్ కి రావ‌డం త‌ప్పేలా లేదు. మ‌రి.. ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

Advertisement