బీర్ బాటిల్ తో టెంపర్ చూపుతోన్న విశాల్…?

విశాల్.. యాక్షన్ హీరోగా కోలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో. తెలుగులోనూ అక్కడి సూపర్ హీరోలకు లేనంత క్రేజ్, మార్కెట్ ఉంది. ఓమీడియం రేంజ్ స్టార్ హీరో సినిమా రేంజ్ లో తెలుగులో అతని సినిమా ఇక్కడ విడుదలవుతుంది అనేది అందరికీ తెలుసు. అయితే విశాల్ కు ముందు నుంచీ ఓ హాబిట్ ఉంది. అతను మాగ్జమం రీమేక్ లకు దూరంగా ఉంటాడు. విపరీతంగా నచ్చితే తప్ప రీమేక్ సినిమాలు చేయడం. అలా నచ్చింది కాబట్టే.. ఇప్పుుడు తెలుగులో ఎన్టీఆర్ కెరీర్ కు కొత్త ఊతమిచ్చిన టెంపర్ ను రీమేక్ చేస్తున్నాడు. టెంపర్ కు ముందు ఎన్టీఆర్ కెరీర్ ప్రశ్నార్థకంలోఉంది.. కానీ టెంపర్ విజయంతో మనోడు కొత్తదనం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ కారణంగానే ఈ మూవీ రకరకాల భాషల్లో రీమేక్ అవుతోందిప్పుడు. అలాగే తమిళంలో విశాల్ చేస్తున్నాడు.
తమిళ్ లో ఈ మూవీ పేరు ‘అయోగ్య’. లైట్ హౌస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వెంకట్ మోహన్ తెరకెక్కిస్తున్నాడు. విశాల్ స్టైల్ కు అనుగుణంగగా.. తమిళ ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను దర్శకుడు మురుగదాస్ చేతుల మీదుగా విడుదల చేశారు.. ఎన్టీఆర్ కంటే ఎక్కువగా అన్నట్టు మనోడు ఏకంగా పోలీస్ జీప్ పై బీర్ బాటిల్ పెట్టుకుని మరీ కూర్చుకున్నాడు. ఏదేమైనా ఇలాంటి పాత్రలు విశాల్ కు బాగా సూట్ అవుతాయి.