హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ చానెల్‌ హవా… గ్రేటర్‌ ఎన్నికలపై ప్రభావం..??

గురువారం వచ్చేసింది. టీవీ రేటింగ్స్‌ సైతం వచ్చేశాయి. అయితే గడిచిన వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని చానెల్స్‌  రేటింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు.. టాప్‌ న్యూస్‌ చానెల్స్‌ వాటి పొజిషన్‌ను నిలబెట్టుకున్నాయి. మరోసారి టీవీ9 నెంబర్‌ వన్‌ స్థానాన్ని కాపాడుకోగా, గత వారంతో పేల్చితే సెకండ్‌, థర్డ్‌ ప్లేస్‌లలోనూ మార్పులు లేవు. ఎన్‌టీవీ రెండో స్థానంలో నిలువగా, టీవీ 5 థర్డ్‌ పొజిషన్‌ను దక్కించుకుంది..
అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌లో టాప్‌ ప్లేస్‌ టీవీ 9 దక్కించుకోగా, రెండో స్థానంలో టీ న్యూస్‌ నిలిచింది. రేటింగ్స్‌ ఎనలిస్టుల ప్రకారం వ్యూయర్స్‌ ఏ చానెల్‌కి పట్టం కడతారో ఆ చానెల్‌కి సంబంధించిన ప్రసారాలని లైక్‌ చేస్తున్నట్లు. పొలిటికల్‌ చానెల్స్ అయితే ఆ కంటెంట్‌ని ఆదరిస్తే వారికే ఓట్లు పడతాయని పండితులు అంచనా వేస్తారు.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం హైదరాబాద్‌లో టీ న్యూస్‌ని ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. దీంతో, గ్రేటర్‌లో ఆశించిన దానికంటే టీఆర్‌ఎస్‌కి ఎక్కువే సీట్లు వస్తాయని భావిస్తున్నారు..
మరికొంతమంది వాదన ప్రకారం రేటింగ్స్‌కి, ఓటింగ్‌కి సంబంధం ఉండదని చెబుతారు.. ఐటమ్స్‌ నచ్చడం లేకపోవడం అనేది ఆ వీక్‌లో వారు ప్రసారం చేసిన ప్రోగ్రామ్స్‌ని బట్టి ఉంటుందని వాదిస్తున్నారు. ఈ విషయం పక్కనపెట్టినా టీ న్యూస్‌ హైదరాబాద్‌ మార్కెట్‌లో సెకండ్‌ ప్లేస్‌ దక్కించుకోవడం, ఆ చానెల్‌లా ఒక స్టేట్‌కే పరిమితమై కూడా టాప్‌లో నిలవడం సంచలనంగా మారుతోంది.. లాస్ట్‌ వీక్‌ రేటింగ్స్‌ ఇలా ఉన్నాయి..

BARC AP/TS TOTAL Mkt
GRPs: WEEK: 46 ALL 15+

1. TV9: 69
2. NTV: 48
3. TV5: 44
4. SAKSHI: 38
5. V6: 31
6. T NEWS: 26
7. ABN: 22
8. ETV AP: 13
9. HM TV: 13
10. AP 24×7: 13
11. I NEWS: 10
12. GEM N: 9
13. RAJ NEWS: 8
14. 10TV: 8
15. ETV TS: 7
16. 99%TV: 5
17. MOJO TV: 4
18. MAHAA NEWS: 4
19. CVR NEWS: 4
20. TV1: 3

ALL NEWS: 376

BARC HYD Mkt

GRPs: WEEK: 46 CS 15+

1. TV9: 115
2. V6: 57
3. T NEWS: 70
4. TV5: 54
5. NTV: 47
6. HM TV: 24
7. ABN: 20
8. GEM N: 17
9. ETV TS: 16
10. SAKSHI: 15
11. I NEWS: 12
12. RAJ NEWS: 11
13. 10TV: 10
14. TV1: 7
15. ETV AP: 6
16. MOJO TV: 6
17. AP 24×7: 5
18. CVR NEWS: 4
19. 99%TV: 3
20. MAHAA NEWS: 2

ALL NEWS: 531