నాగబాబుని నవ్వించిన వెంకటేష్‌

సంక్రాంతి పంగగకు సరిగ్గా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘ఎఫ్-2’.  వెంకటేష్, వరుణ్ తేజ్ క్రేజీ కాంబినేషన్ లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో వచ్చిన మిగతా సినిమాలతో పోలిస్తే ఎఫ్‌ 2 సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. సినిమాలో కామెడీ బావుందని క్రిటిక్స్‌ సైతం అంగీకరిస్తున్న మాట.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న బాలయ్య- నాగబాబుల వివాదం సినిమాపై ప్రభావం చూపించకపోవడం గమనార్హం. కొంత కాలంగా మెగా బ్రదర్ నాగబాబు నందమూరి బాలకృష్ణను టార్గెట్ గా చేసుకొని కౌంటర్లు వేస్తున్నాడు. దాంతో నందమూరి అభిమానులు నాగబాబు కుటుంబంపై, మెగా ఫ్యామిలీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ కోపమంతా రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై చూపించారు. సినిమాకు కొంచెం నెగిటివ్ టాక్ రావడంతో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని విపరీతంగా ట్రోల్స్ చేస్తూ సినిమాను ఓ రేంజ్ ఆడుకున్నారు. చెర్రీ సినిమానే ఇలా ఆడుకున్నారంటే నాగబాబు కొడుకు సినిమా పరిస్థితేంటి అని అనుకున్నారు? కానీ సినిమాకి పాజిటివ్‌ టాక్‌ రావడంతో నాగబాబు వీడియోల కాంట్రవర్శీ నుండి  ఇది బయటపడుతుందని మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ హీరో వెంకీ తనదైన కామెడీ టైమింగ్ తో సినిమాను నడిపించాడు. దర్శకుడు అనిల్  రైటింగ్.. వెంకీ టైమింగ్ సరిగ్గా కుదిరి ఒక దశ వరకు ‘ఎఫ్-2’ కడుపు చెక్కలయ్యేలా చేస్తుంది. వరుణ్ వెంకీతో పోటీ కామెడీ చేయలేకపోయినా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మెగా అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.