ఒకరు టీడీపీ.. మరొకరు టీఆర్‌ఎస్‌.. టీవీ9, ABN డిష్యుం డిష్యుం….!!

తెలంగాణ ఎన్నికలను రాజకీయ నాయకులు ఎంతవరకు వాడుకుంటున్నారో తెలియదు కానీ మీడియా వాళ్ళు మాత్రం బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. ప్రముఖ చానెళ్లు కూడా తమ అనుకూల పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది…

నిన్న మొన్నటి వరకు టిడిపి అనుకూల మీడియాగా పలు రాజకీయ పార్టీల నుండి ముద్ర వేయించుకున్న టీవీ9 సడెన్‌గా టీఆర్‌ఎస్‌ స్టాండ్‌ తీసుకుందని వాపోతున్నారు తెలుగు తమ్ముళ్లు.. తాజాగా టీఆర్‌ఎస్‌కి అనుకూలంగా సర్వే ఫలితాలను వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

హైదరాబాద్‌కి చెందిన సర్వే సంస్థ సీపీఎస్‌ నిర్వహించిన సర్వే అని మొదలుపెట్టి టీఆర్‌ఎస్‌ తెలంగాణలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పక్కాగా తేల్చిపారేసింది టీవీ 9. అధికారం నిలబెట్టుకోవడమేకాక ఏకంగా స్వీప్‌ చేస్తుందని తెలిపింది. గులాబీ దండు ఏకంగా ఏకంగా 94-104 స్థానాలు సంపాదించుకొని విజయభేరి మోగిస్తుందని చెప్పింది.

టీవీ9 సర్వేపై, ఆ చానెల్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టిఆర్ఎస్ ఒత్తిడికి లొంగిపోయి టీవీ9 ఇలా ఆ పార్టీకి అనుకూల ఫలితాలు రిలీజ్‌ చేసిందని ప్రచారం జరుగుతోంది. టీవీ9 ని టిఆర్ఎస్ అనుకూల యాజమాన్యం తన చేతుల్లోకి తీసుకుందని, అందుకే తన క్రెడిబిలిటీని పక్కన పెట్టి టిఆర్ఎస్ కు అనుకూలంగా సర్వేని టెలికాస్ట్ చేసిందనే వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే టీడీపీ మీడియాగా ఇమేజ్‌ దక్కించుకున్న ABN ఆంధ్రజ్యోతి, టీవీ9 సర్వేకి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిపోతుందట. లగడపాటి సర్వే పేరుతో ప్రజా కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది.. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో చంద్రబాబుకు అనుకూలంగా ABN ఆంధ్రజ్యోతి, కేసీఆర్ కు అనుకూలంగా టీవీ9ల మధ్య పెద్ద యుద్ధమే జరిగేలా కనిపిస్తోందని మీడియా వర్గాలు చెబుతున్నాయి..

ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న ఈ రెండు న్యూస్ చానెళ్లు తమ అనుకూల పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇన్ డైరెక్ట్ వార్ కి సిద్ధమవుతున్నాయా…? ఒకరి ఆ పార్టీకి, మరొకరు మరో పార్టీకి సర్వేలు ఇవ్వడం వెనుక ఏం జరగబోతోంది.? ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఏపీ ఎన్నికల నాటికి సీన్‌ మరింత మారిపోవడం ఖాయమా.???