టైమ్స్‌ నౌ లేటెస్ట్‌ సర్వేని నమ్మని తెలుగు మీడియా…???

ప్రముఖ జాతీయ చానెల్‌ టైమ్స్‌ నౌ – సీఎన్‌ఎక్స్‌ చానెల్స్‌ కలిపి ఓ సర్వే చేశాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న మూడ్‌, ఓటింగ్‌ ఎవరికి ఫేవర్‌గా ఉంది..? ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది?. ఎవరు ఓడిపోబోతున్నారనే అంశాలపై సర్వే చేసింది. ఈ సర్వేలో టీఆర్‌ఎస్‌ మరోసారి అధికారం నిలబెట్టుకుందని తేల్చి పారేసింది. మొత్తం 119 నియోజకవర్గాలలో 70 స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని, మేజిక్‌ మార్క్‌కి మించిన ఫిగర్‌ వస్తుందని తేల్చిపారేసింది.
తెలంగాణలో కూటమికి అంత సీన్‌ లేదని, నాలుగు పార్టీల కూటమికి 33 స్థానాలు వరిస్తాయని వివరించింది.. ఇందులో టీడీపీకి కేవలం 2 నియోజకవర్గాలే లభిస్తాయని,  కాంగ్రెస్‌కి 31 దక్కించుకుంటుదని తేల్చి పారేసంది టైమ్స్‌ నౌ సర్వే..
అయితే ఈ సర్వేని తెలుగు మీడియాలో నమస్తే తెలంగాణ వీ6తోపాటు సాక్షి మీడియా మాత్రమే ప్రకటించాయి. మరో చానెల్స్‌, పత్రికలు ఈ సర్వేపై ఫోకస్‌ పెట్టలేదు. ఇదంతా ఫేక్‌ సర్వే అని భావించడంతోనే ఆ పత్రికలు లైట్‌ తీసుకున్నాయని చెబుతున్నారు. సర్వే వెలుగు చూసిన టైమింగ్‌ దీనికి పక్కా ఉదాహరణ అని అభిప్రాయ పడుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీ అడుగుపెట్టి, మేడ్చల్‌ స్పీచ్‌కి రెడీ అయిన వెంటనే ఈ బ్రేకింగ్‌ న్యూస్‌ నేషనల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. అంటే కేవలం సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ పర్యటనను దానితో  కాంగ్రెస్‌కి కూటమికి వచ్చే మైలేజ్‌ని సైడ్‌ చేసేయడానికే ఇది కావాలని కొందరు క్రియేట్‌ చేసిన పెయిడ్‌ సర్వే అని తలపోస్తున్నాయట ఈ చానెల్స్‌..
తెలంగాణలో ఉన్న మూడ్‌ని ఆ చానెల్‌ సరిగా అర్ధం చేసుకోలేకపోయిందని, ఇక్కడ పక్కాగా కూటమికి అడ్వాన్స్‌ కనిపిస్తోందని గ్రౌండ్‌ లెవల్‌లో  టీఆర్‌ఎస్‌కి అంత సీన్‌ లేదని అవి భావిస్తున్నాయట.. అందుకే, గులాబీ నేతలలో కొందరు గీసిన స్కెచ్‌ ఇదని కొందరు సీనియర్‌ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.. మరో రెండు వారాల్లో తెలంగాణలో అధికారం ఎవరిదనేది తేలిపోనుంది..