ఆ దర్శకనిర్మాతలకు హ్యాండ్‌ ఇచ్చిన సమంత…!!

అక్కినేని సమంత పెళ్లి తరువాత చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తోంది. పెళ్ళికి ముందు గ్లామర్ రోల్స్ కి ఎక్కువగా కనిపించింది. కానీ అక్కినేని ఇంటికి కోడలైన తరువాత సమంత డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఇప్పుడు ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం భర్త నాగ చైతన్యతో కలిసి ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటిస్తూనే మరో కొరియన్ రీమేక్ సినిమా కోసం సిద్ధమవుతోంది సమంత. లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆ కొరియన్ మూవీలో సమంత 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి.

 ఓ 70ఏళ్ల వృద్ధురాలు అతీత శక్తులను ఉపయోగించి 20ఏళ్ల యువతిల ఎలా మారిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఈ సినిమా వృద్ధురాలి పాత్రతో పాటు 20 ఏళ్ల యువతి పాత్రలో కూడా నటించేందుకు మొదట సమంత ఒప్పుకుంది. అయితే సమంత ఇప్పుడు మనసు మార్చుకుందట. ముసలి పాత్రలో కనిపిస్తే మార్కెట్ డ్యామేజ్ అనుకుందో ఏమో గాని చివరికి ఆ పాత్రకు మొదలవ్వకముందే ఎండ్ కార్డ్ పెట్టేసిందట. 

ఇక సమంత తో రెండు రోల్స్ చేయిస్తే టైమ్ తో పాటు బడ్జెట్ పరంగా ఎక్కువ ఖర్చవుతుందని చిత్ర బృందం భావిస్తోందట. దీంతో సీనియర్ నటి లక్ష్మిని ఆ పాత్ర కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.  ఒరిజినల్ కథలో కూడా ఇద్దరు వేరు వేరు నటీనటులే ఆ పాత్రలను చేశారు. 20 ఏళ్ల యువతి పాత్రలో సమంతని, వృద్ధురాలి పాత్రలో లక్ష్మిని చూపించబోతున్నారట. ఈ సినిమాలో హీరో నాగ శౌర్య, నటుడు రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట.