ఫ్లాప్ టాక్… అయినా రికార్డులు తిరగరాస్తున్న వినయవిధేయ రామ..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా నెగిటివ్ గా వచ్చినప్పటికీ ఆ ప్రభావం సినిమా కల్లెక్షన్లపై ఏ మాత్రం పడలేదు. ఓవర్సీస్ లో ప్రమియర్ కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే స్వదేశంలో వినయ విధేయుడు భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్నాడు. తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 26 కోట్ల షేర్ ను రాబట్టి షాక్ ఇచ్చాడు. ఈ కలెక్షన్ తో టాలీవుడ్ లో బాహుబలి , అజ్ఞాతవాసి చిత్రాల తరువాత బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా ‘వినయ విధేయ రామ’ రికార్డు సృష్టించింది.

అంతేకాదు సీడెడ్ లో అయితే ఏకంగా బాహుబలి2 రికార్డును బ్రేక్ చేసింది ‘వినయ విధేయ రామ’ సీడెడ్ లో బాహుబలి2 రూ. 6కోట్ల షేర్ రాబట్టగా ఈ సినిమా ఏకంగా రూ.7.20కోట్ల షేర్ రాబట్టింది.


ఇక ఏరియాల వారీగా కలెక్షన్స్ చూస్తే…

ఏరియా                                   రూ. కోట్లలో

సీడెడ్—————————-7.20 కోట్లు
నైజాం————————-   5.08 కోట్లు
గుంటూరు———————    4.18 కోట్లు
నెల్లూరు ———————–   1.69కోట్లు
ఉత్తరాంధ్ర ———————    2.45కోట్లు
ఈస్ట్ ————————–   2.05కోట్లు
వెస్ట్—————————-  1.83కోట్లు
కృష్ణ————————-—-1.59కోట్లు

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు షేర్ 26.07 కోట్లు రాబట్టింది.  ఎటూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు కాబట్టి మరో వారం రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే జోరు కొనసాగితే కలెక్షన్స్ మోత మోగడం గ్యారెంటీగా చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు.