బోయపాటి.. రామ్ చరణ్ ను ముంచుతున్నాడా..?

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా `వినయవిధేయ రామ`. ఊరమాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న  ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తోన్న వార్త అదే. ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదా అనే అనుమానాలు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. లేదంటే అతి నమ్మకంతో ఉన్నారా అనుకుంటున్నారు.
ఇప్పటికే సంక్రాంతి బరిలో ఈ సినిమా కాకుండానే మరో మూడు భారీ సినిమాలుున్నాయి. `ఎన్టీఆర్ కథనాయకుడు`, `ఎఫ్ -2`, తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ `పెట్టా` విడుదల కాబోతున్నాయి. ఎలా చూసుకున్నా పోటీ గట్టిగానే ఉన్నట్టు.. అయినా ఈ మూవీకి సంబంధించి ఇంత వరకూ పెద్దగా ప్రమోషనల్ యాక్టివిటీస్ కనిపించడం లేదు. అందుకు కారణం బోయపాటి అంటున్నారు. కారణం బాలయ్యేనట.
బాలకృష్ణ, బోయాపాటిల బంధం అందరికీ తెలిసిందే. ఆయన్ని తన అభిమాన హీరోగా చెప్పుకుంటాడు బోయపాటి.. ఇప్పుడు సంక్రాంతి బరిలో బాలయ్య `ఎన్టీఆర్` గా వస్తున్నాడు. ఇటు తనూ ఉన్నాడు బరిలో. దీంతో తను కాస్త వెనక్కి తగ్గాలనే ఆలోచనతోనే వినయవిధేయ రామను కాస్త నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటున్నారు. ఈ కారణంగానే అతను ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ పై ఇప్పటి వరకూ ఏ క్లారిటీ లేకుండా ఉన్నాడట.పైగా మొదటి పాట బానే ఉన్నా.. మొన్న విడుదలైన పాట మరీ రొటీన్ గా ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు విన్నట్టుగా ఉందా పాట. ఇవి సినిమాకు మైనస్ అవుతాయి. అలాంటప్పుడు ప్రమోషన్స్ తో కవర్ చేయాలి కానీ కామ్ గా ఉంటే ఎట్టా అంటున్నారు అభిమానులు.
ఇక బాలయ్యకు పెద్ద పోటీ ఇవ్వకూడదనే బోయపాటి ఇలా చేస్తున్నాడా అని చరణ్ అభిమానులు అనుమానపడుతున్నారు. అదే నిజమైతే చరణ్ కు హ్యాట్రిక్ మిస్ అవుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ఇవాళా రేపూ ప్రమోషన్ లేకపోతే అంతే సంగతులు. ఈ విషయం ఎంటైర్ ఇండస్ట్రీకి తెలుసు. ఇకక రామ్ చరణ్ ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నాడట. కానీ తను కూడా చాలా బిజీగా ఉన్నడు కదా… అటు `ఆర్ఆర్ఆర్` షూటింగ్ లో పాల్గొంటూనే.. ఇటు `సైరా` నిర్మాణ వ్వవహారాలు చూసుకోవాలి. ఇలాంటప్పుడు దర్శకుడే ప్రమోషన్స్ గురించి చొరవ తీసుకోవాలి కదా.. కానీ అలాంటి ప్రయత్నాలు బోయపాటి నుంచి కనిపించడం లేదు. చూస్తోంటే ఇతను నిజంగానే బాలయ్యకు `కొంత`ఫేవర్ చేస్తున్నాడా అనే అనుమానాలు నిజమే అనిపించడం లేదూ.. అసలే ఇప్పుడు మెగా, నందమూరి వార్ జరుగుతోంది.