ఆ ముగ్గురు దర్శకులే టాప్‌… కొత్త వివాదానికి తెరదీసిన రామ్‌చరణ్‌…!!

Varun Tej
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కొత్త కాంట్రవర్శీకి తెరదీశాడు.. అనాలోచితంగా అన్నాడో.. ఉద్దేశ్యపూర్వకంగా అన్నాడో కానీ… రీసెంట్‌గా అంతరిక్షం ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయంటున్నారు క్రిటిక్స్‌.. తెలుగు ఇండస్ట్రీలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు ముగ్గురే అని వ్యాఖ్యానించాడు రామ్ చరణ్.

మొన్నటికి మొన్న ఓ సినిమా ఫంక్షన్ లో రెస్పెక్ట్ మీద జనాలకు క్లాస్ పీకి నెటిజన్ల ట్రోల్స్ కి బలయ్యాడు బన్ని. ఇప్పుడు మరో సినిమా ఆడియో ఫంక్షన్ లో రామ్ చరణ్ నోరు జారీ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాడు. తమ్ముడు వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు చెర్రీ. అక్కడ సినిమా గురించి మాట్లాడుతూ పనిలో పనిగా ముగ్గురు దర్శకులను ఆకాశానికెత్తేసాడు.

తెలుగు ఇండస్ట్రీలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు రాజమౌళి, సుకుమార్, క్రిష్ అని అన్నాడు. అంతరిక్షం డైరెక్టర్ సంకల్ప్ కూడా అలాంటి కోవలోకి రావాలని కోరుకున్నాడు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ, తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు ముగ్గురేనా అని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ కి రంగస్థలం హిట్ ఇచ్చాడు కాబట్టి సుకుమార్, అంతకు ముందు మగధీర చేసాడు, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు కాబట్టి రాజమౌళి గొప్ప దర్శకులు. ఇక వరుణ్ తేజ్ తో కంచె చేసి, చరణ్ మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి క్రిష్ ని కూడా గొప్ప దర్శకుడే అంటూ చెప్పుకొచ్చాడు.

నిజానికి తెలుగు సినిమా పురుడుపోసుకున్న రోజు నుండి ఎందరో గొప్ప గొప్ప దర్శకులు ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించారు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ప్రతీభావంతులైన దర్శకులు ఎందరో ఉన్నారు. అందరినీ మర్చిపోయి తాను పని చేసిన సినిమా దర్శకులను మాత్రమే గొప్ప వాళ్ళు అనడం వెనుక చెర్రీ ఆంతర్యం ఏమిటని నెటిజన్లు మండి పడుతున్నారు. ఆడియో ఫంక్షన్ లలో దర్శకులను, హీరోలను పొగడొచ్చు కానీ అవి మితిమీరితేనే ఇలా వివాదలకు దారి తీస్తాయని అంటున్నారు సినీ అభిమానులు.