ఎన్టీఆర్‌ హిట్‌ సినిమాకి సీక్వెల్‌ రెడీ…!!

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లో మరిచిపోలేని మూవీ అదుర్స్‌..  ఎన్టీఆర్, వీవీ వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘అదుర్స్’ మూవీ జూనియర్ కెరీర్ లోనే పర్‌ఫెక్ట్‌ కామెడీ ఎంటర్‌టయినర్‌గా నిలిచింది. తారక్ లోని కామెడీ టైమింగ్‌ని ఎలివేట్‌ చేసిన ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. తన కెరీర్‌లో చారి పాత్ర కలకాలం నిలిచిపోతుందని ఎన్టీఆర్‌ పలుమార్లు చెప్పాడు.. ఆయనని అలాంటి పాత్రలో చూడాలని ఇటు ఫ్యాన్స్‌ సైతం కోరుకుంటున్నారు.. దీంతో ఆ సినిమా సీక్వెల్ చేయాలనీ చాలా రోజులుగా అదుర్స్ టీమ్ ఆలోచన చేస్తుందట. 

అదుర్స్ సీక్వెల్ తప్పకుండా చేస్తానని ఎన్టీఆర్ చాలా సార్లు చెప్పాడు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఆ సినిమాకు సంబంధించిన సీక్వెల్ టాక్ వినిపిస్తోంది. అదుర్స్ రచయిత కోన వెంకట్ సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ అయిందని, సినిమాకు ఎన్టీఆర్ డేట్స్ దొరకడమే లేట్ అంటూ చెప్పుకొచ్చాడు. 

అయితే అదుర్స్ సీక్వెల్ ని ఎవరు డెరెక్ట్ చేస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే డైరెక్టర్ వినాయక్ ఇప్పుడు అసలు ఫామ్ లో లేడు. వరుస ప్లాపులతో ఉన్న వినాయక్ తో సినిమాలు చేయడానికే ఎవరూ సాహసించడం లేదు. మరి కథ ఎన్టీఆర్ వరకు వెళితే వినాయక్ తో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఒప్పుకున్నా ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తయే వరకు సీక్వెల్ గురించి ఆలోచించే అవకాశం అయితే లేదు.