టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న నాని:

హీరోగా వరుస సినిమాలు చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని  “అ!” అనే డిఫరెంట్ సినిమాతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవకపోవడంతో హీరోగా సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇక రీసెంట్ గా ఒక కథ నచ్చడంతో ప్రొడ్యూస్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట నాని. ఇటీవలే రచయిత విజయేంద్ర ప్రసాద్ నానికి ఓ లేడీ ఓరియెంటెడ్ కథను వినిపించాడట. ఆ కథకు నాని ప్రొడ్యూస్ చేయాల్సిందిగా కోరాడట. సబ్జెక్ట్ నచ్చడంతో కథ విన్న వెంటనే నాని ఒకే చెప్పేశాడట.

అయితే విజియేంద్ర ప్రసాద్ చెప్పిన కథకు సమంత అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని నాని చెప్పాడట. అందుకే సమంతను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.  గతంలో నాని -సమంత హీరోహీరోయిన్స్ గా మూడు సినిమాల్లో నటించారు. అయితే ఈసారి సమంత హీరోయిన్ గా నటిస్తే నాని ప్రొడ్యూస్ చేస్తాడట. మరి ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి ‘మజిలీ’ సినిమాలో నటిస్తోంది. త్వరలో నందిని రెడ్డి డైరెక్షన్ లో రీమేక్ మూవీ చేయనుంది. అటు నాని కూడా ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు.  ఈ సినిమాలన్నీ పూర్తయితే గాని నాని ప్రొడ్యూస్ చేయబోయే సమంత సినిమా పట్టాలెక్కాదు.