జెర్సీ టీజర్: సూటిగా సుత్తిలేకుండా!…. జెర్సీ టీజర్‌ రివ్యూ..!!

నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు మళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి తెరకెక్కిస్తున్న సినిమా ‘జెర్సీ’. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న్యూయార్ కానుకగా సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేసిన ‘జెర్సీ’ టీమ్’ సంక్రాంతి శుభాకాంక్షలతో తాజాగా టీజర్ విడుదల చేశారు. 
క్రికెటర్ కావాలనుకునే ఓ వ్యక్తి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని.. అర్జున్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే తన కల నేరవేర్చుకునేందుకు అర్జున్‌ పడిన కష్టాన్ని ఎమోషనల్ గా తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. తాను అనుకున్న స్థానానికి చేరుకోవడానికి అర్జున్ పడిన కష్టం… నిరుత్సాహ పరిచే మాటలను అధిగమించిన తీరు… చివరకు కల నేర్చుకొని పొందిన ఆనందం ఒక ఒక నిమిషం 29 సెకండ్ల టీజర్లో షార్ట్ గా చూపించారు. 
కథ అంతా క్రికెట్ నేపథ్యంలోనే సాగుతుందనై టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ‘ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు గానీ .. ప్రయత్నిస్తే ఓడిపోయినవాడు లేడు’ అనే డైలాగ్ చాలా బాగుంది. ఇందులో నాని క్రికెట‌ర్‌గా అద‌ర‌గొట్టాడు. ఈ పాత్ర కోసం నాని క్రికెట్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడ‌ని తెలుస్తోంది. 
సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ జతకట్టింది. ఈ సినిమా నానికి మ‌రో మంచి హిట్ అందించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు చెబుతున్నారు. కాగా నాని కూడా ‘జెర్సీ’ తన కెరీర్ లోనే చెప్పుకోదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న  ‘జెర్సీ’  ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.