బాబాయ్‌, అబ్బాయిలు ఒకే వేదికపైకి మరోసారి…!!


సంక్రాంతి బరిలో నిలిచేందుకు పెద్ద సినిమాలన్నీ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాలన్నీ ప్రమోషన్ స్పీడు పెంచాయి. ఇక ముందు నుండే ఏదో ఒక రకంగా జనాల నోళ్ళలో మెదులుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే పనిలో పడింది చిత్ర బృందం. రెండు రోజుల్లో ట్రైలర్ లాంచ్ చేసి.. ఆ తర్వాత ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరులో సినిమా ఆడియో రిలీస్ వేడుక పెద్ద ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘యన్.టి.ఆర్’ ఆడియో వేడుకను ఇంకెక్కడైనా చేస్తే కథ వేరు. కానీ ఎన్టీఆర్ సొంత ఊరిలోనే చేస్తుండడంతో నందమూరి కుటుంబం అంతా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బాలయ్య అందరికి ఆహ్వానాలు కూడా పంపినట్లు తెలుస్తోంది.

ఎంతమంది కుటుంబ సభ్యులు వచ్చినా ఎన్టీఆర్ వస్తే ఆ కళ వేరు. అయితే బాలయ్య ఎన్టీఆర్ ని పిలిచాడు లేదా అన్నదానిపై ఇప్పటి వరకు సమాచారం లేదు. నిజంగా జూనియర్ ని పిలిచి ఉంటె ఈ పాటికి టాలీవుడ్ పిఆర్వోలకు సమాచారం వచ్చి ఉండేది. మీడియాకి వార్త అంది ఉండేది. కానీ అదేదీ కనిపించట్లేదు. నిజానికి ఎన్టీఆర్ ఇన్నేళ్లు నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటూనే వచ్చాడు. ఆ కుటుంబంలో జరిగే ఏ శుభకార్యానికీ ఎన్టీఆర్ ని పిలిచే వాళ్ళు కాదు.

అయితే హరికృష్ణ మరణం తరువాత బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య దూరం తగ్గినట్లే కనిపించింది. ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌కు కూడా బాలయ్య వచ్చాడు. కానీ సుహాసిని ఎన్నికల ప్రచారానికి బాలయ్య రావడం, తారక్ రాకపోవడం చూసి మరోసారి వీరి మధ్య సంబంధాలపై చర్చ జరిగింది. ఎన్నికల సంగతంటే ఫలితాలు కూడా వచ్చేసాయి… అది అయిపోయింది. ఒకవేళ అది మనసులో పెట్టుకొని బాలయ్య ఆడియో వేడుకకు ఎన్టీఆర్ ని ఆహ్వానించకపోతే అతడి మీద ఉన్న వివక్ష గురించి మరోసారి చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ రాకపోతే బాలయ్య నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది బాలయ్యకు డ్యామేజే. మరి బాలయ్య ఎం చేస్తాడో చూడాలి.