నాగబాబు కావాలనే చెర్రీని ఇరికించాడా?

జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తుంటే నాగబాబు కావాలనే చెర్రీని ఇరికించాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ ను టార్గెట్ గా చేసుకొని కౌంటర్లు వేస్తున్నాడు. ఆ వివాదం కాస్త సంక్రాంతి సినిమాల రిలీజ్ సమయానికి తీవ్రమైంది. కథానాయకుడు, వినయ విధేయ రామ సినిమాల రిలీజ్ రెండు మూడు రోజుల ముందు వరసగా బాలయ్యపై కౌంటర్ వీడియోలు వదులుతూ సంచలనం సృష్టించాడు. 

నిజానికి నాగబాబు పోస్ట్ చేసిన వీడియోల వల్ల ‘కథానాయకుడు’ సినిమాపై ప్రభావం పడుతుందని చాలా మంది భావించారు కానీ ఆ సినిమాకు క్రిష్ పెంచిన హైప్ తో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. కొంత నెగిటివ్ ప్రచారం జరిగినా అది సినిమాపై అంతగా ప్రభావం చూపించలేదు. కానీ ఎఫెక్ట్ చెర్రీ సినిమాపై కనిపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. 

నాగబాబు వరుస వీడియోలు పెట్టి రెచ్చగొట్టడంతో నందమూరి అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ కోపమంతా అప్పుడే రిలీజైన రామ్ చరణ్ మూవీ ‘వినయ విధేయ రామ’పై చూపించారట.  చెర్రీ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో సినిమాపై విపరీతంగా ట్రోల్స్ చేస్తూ సినిమాకు చుక్కలు చూపించారనే వాదన వినిపిస్తోంది. ఇక ఆ తరువాత వచ్చిన వరుణ్ తేజ్, వెంకటేష్ ల కామెడీ మూవీ ‘ఎఫ్-2’ పై నందమూరి అభిమానుల ప్రభావం అంతగా కనిపించలేదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

వెంకీ ఉన్నాడని లైట్ తీసుకున్నారో, లేకపోతే ఇంకేదైనా కారణమో తెలియదు కానీ ‘ఎఫ్-2’ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇదంతా చుసిన చరణ్ అభిమానులు నాగబాబు కావాలనే తమ హీరో సినిమాని ఈ వివాదంలో ఇరికించాడని ఆరోపిస్తున్నారు. సినిమాలు విడుదలయ్యే సమయానికి వీడియోలు పెడుతూ నందమూరి అభిమానులు రెచ్చగొట్టి చెర్రీపై ఉసిగొలిపాడని వాపోతున్నారు. తన కొడుకును హైలైట్ చేసుకోడానికి చెర్రీ క్రేజ్ ని తగ్గించేలా ప్లాన్ చేశాడని అసహనం వ్యక్తం చేస్తున్నారట కొందరు మెగాభిమానులు.  మరి నాగబాబు ఎవరికి అడ్వాంటేజ్‌ తీసుకు రావాలని ప్లాన్ చేశాడో కానీ ఆ వివాదంలో రామ్ చరణ్ మాత్రం బలయ్యాడనేది ఇండస్ట్రీ వర్గాల మాట.