బాలయ్య కథానాయకుడికి `మెగా` గండం…!!

టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న నాగబాబు వర్సెస్ బాలయ్య వార్ ఎన్టీఆర్ కథానాయకుడు బయ్యర్లను కలవరపెడుతుందట. మరో కొన్ని గంటల్లో సినిమా విడుదల కానున్న తరుణంలో నాగబాబు బాలయ్య పై విరుచుకుపడుతూ వరుసగా వీడియోలు పెడుతుండడంతో బయ్యర్లు కంగారు పడుతున్నారట.

అసలే ఎన్టీఆర్ బయోపిక్ కి వెన్నుపోటు పొడవడానికి వర్మ కాచుకొని కూర్చున్నాడు. అది సరిపోదని నాగబాబు రూపంలో మరో గండం ఎన్టీఆర్ బయోపిక్ పై పండిందని ఆందోళన చెందుతున్నారట. సొంత బావే తండ్రికి వెన్నుపోటు పొడిచినప్పుడు బాలయ్య బ్లడ్, బ్రీడ్ ఏమయ్యాయని నాగబాబు ప్రశ్నించడం ప్రేక్షకుల్లో నెగిటివ్ ప్రచారానికి దారి తీస్తుందేమో అని బాధపడుతున్నారట. సినిమా రిలీజ్ అయ్యే సమయంలో బాలయ్య గతంలో చేసిన కామెంట్స్ ని నాగబాబు బయటపెట్టడం కొన్ని వర్గాల్లో ఆగ్రహం పెంచుతుందని అది సినిమాపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారట.

ఇప్పటివరకైతే ఎన్టీఆర్ కథానాయకుడు మంచి హైప్ తెచ్చుకుంది. ప్రమోషన్ విషయంలో టీమ్ బాగానే కష్టపడుతుంది. సెన్సార్ కూడా కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో బయ్యర్లు ఖుష్ అయ్యారు. అంతలోనే నాగబాబు రూపంలో నెగిటివ్ ప్రచారం ఊపందుకుంది. నాగబాబు వీడియోలు పోస్ట్ చేస్తుండడంతో దాన్ని అవకాశంగా తీసుకొని మెగా అభిమానులు బాలయ్యతో చెడుగుడు ఆడుకుంటున్నారు. దీనికి తోడు రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ కూడా రెండు రోజుల వ్యవధితోనే రిలీజ్ అవుతుండడంతో మెగా నందమూరి అభిమానుల మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరుతోంది.

సంక్రాంతి బరిలో ఏ సినిమా గెలుస్తుందో చూద్దాం అంటూ బెట్టింగులకు దిగుతున్నారు.    దాంతో ఆ ప్రభావం సినిమాలపై ఎక్కడ పడుతుందో అని బయ్యర్లు హడలి పోతున్నారు. నాగబాబేమో తగ్గడం లేదు…. ఆ విషయంపై స్పందించాల్సిన బాలయ్య ఏమి పట్టనట్టు సినిమా ప్రమోషన్ లో బిజీ అయిపోయాడు. మధ్యలో బయ్యర్లు కొంచెం తేడా వచ్చినా మునిగిపోతామని బయ్యర్లు భయపడుతున్నారు. ఈ సమయంలో బాలయ్య స్పందించకపోవడం కూడా ఒకందుకు మంచిదే. ఇప్పుడు బాలయ్య రియాక్ట్ అయితే వివాదం మరింత పెద్దదవుతుంది. అది బాలయ్య  ప్రతిష్ట్మాకంగా చేసిన ఎన్టీఆర్ సినిమాపై ప్రభావం చూపిస్తుంది. అవేవి జరగకుండా బాలయ్య బాగానే జాగ్రత్త పడ్డారు కానీ పండగ వేళ మెగా గండం నుండి బయటపడి సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.