మోహన్ లాల్ మళ్లీ మొదలుపెట్టాడు..?

ఒక భాషలో మెగాస్టార్.. మరో భాషలో స్మాల్ స్టార్ రేంజ్ లో కూడా ఉండడు అనేది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. అయితే ఇప్పుడు తక్కువ కానీ.. రెండు దశాబ్ధాల క్రితం మనకు మళయాల డబ్బింగ్ సినిమాల జోరు బాగా ఉండేది. ముఖ్యంగా అక్కడి నుంచి సురేష్ గోపీ సినిమాలు బాగా వచ్చేవి. అలాగే మమ్మూట్టి, మోహన్ లాల్ ల యాక్షన్ సినిమాలు ఎక్కువగా కనిపించేవి. బట్ కొన్నాళ్లకు అవి రొటీన్ గా ఉండటంతో మనాళ్లు చూడ్డం మానేశారు. కట్ చేస్తేఇన్నాళ్ల తర్వాత మోహన్ లాల్ మనకు జనతా గ్యారేజ్ తో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ కావడంతో ఇక అప్పటి నుంచిఅతని కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఈ కోవలోకి మోస్ట్ అవెయిటెడ్ మాలీవుడ్ మూవీ ‘ఒడియన్’ కూడా చేరింది.
వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకునే మోహన్ లాల్ మరోసారి అలాంటి డిఫరెంట్ సినిమాతోనే వస్తున్నాడు. ‘ఒడియన్’ అనేది కేరళలో బాగా ప్రాచుర్యంలో ఉన్న జానపత కథ. అతనికి ఎన్నో అతీంద్రియ శక్తులున్నాయని అక్కడి జనం నమ్ముతుంటారు. అతను తన మంత్రశక్తితో రకరకాలు రూపాల్లోకి మారుతుంటాడు అని నమ్ముతారు. అలాంటి వ్యక్తి పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నాడు. డిసెంబర్ 14న విడుదల కాబోతోన్న ఈ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేయబోతున్నారు. చాలాకాలంగా షూటింగ్ జరుపుకున్న ఒడియన్ కోసం మళయాలంలో మోహన్ లాల్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. మరి జనతా గ్యారేజ్ తర్వాత మోహన్ లాల్ నుంచి వస్తోన్న నాలుగో డబ్బింగ్ సినిమా ఇది. అంటే ఇకపై మోహన్ లాల్ సినిమాలు కూడా డబ్బింగ్ లుగా మనపై దండయాత్ర చేయబోతున్నాయన్నమాట.