సురేందర్ రెడ్డికి `మెగా` అల్టిమేటమ్…?

అన్ని సినిమాలూ ఒకలా ఉండవు. కొన్ని సినిమాలు చాలా తక్కువ టైమ్ లో పూర్తవుతాయి. మరికొన్ని చాలా టైమ్ తీసుకుంటాయి. ఇంకొన్ని ఎప్పుడు పూర్తవుతాయో క్లారిటీ ఉండదు. అలాంటిసినిమాల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’. అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్.. బ్రహ్మాజీ, విజయ్ సేతుపతి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పీరియాడిక్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి ఈ జానర్ తో అస్సలేం పరిచయం లేని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.. అయితే ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ పెద్దగా రావడం లేదు. కొన్ని షెడ్యూల్స్ అయిపోయాయి అనే వార్తలు తప్ప .. క్లియర్ గా ఏ న్యూసూ చెప్పడం లేదు.. అయితే కొన్నాళ్ల క్రితం 2020 సంక్రాంతికి విడుదల చేస్తాం అన్నారు. బట్ ఆ రోజు కూడా విడుదల కావడం లేదనేది లేటెస్ట్ న్యూస్..
భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి కాదు 2019 దసరాకే తీసుకువచ్చేలా ప్లాన్ చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి చిరంజీవి అల్టిమేటమ్ జారీ చేశాడట.. ఇప్పటికే అనుకున్న బడ్జెట్ నుమించేలా కనిపిస్తుండటమే అందుకు కారణం అంటున్నారు. కానీ దర్శకుడు మాత్రం పూర్తి క్లారిటీగా లేకపోవడంతో ఇలా జరుగుతోందని ముందు నుంచీ చెబుతున్నారు.
నిర్మాత రామ్ చరణ్ మాత్రం తండ్రి చెప్పిన మాటలు పట్టించుకోవద్దని.. నువ్వు కావాల్సినంత టైమ్ తీసుకోమని దర్శకుడుకి చెప్పాడట. బట్ ఫైనల్ గా  ఈ చిత్రాన్ని వచ్చే యేడాది దసరాకే విడుదల చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సో .. మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి కాదు.. దసరాకే డబుల్ ఫెస్టివ్ జరగబోతోందన్నమాట.