పేట నిర్మాతలకు మెగా ప్రొడ్యూసర్‌ వార్నింగ్‌

తెలుగు సినిమాల్లో థియేటర్ మాఫియా పెరిగిపోయింది. కొందరి చేతుల్లోనే థియేటర్స్ ఉన్నాయి.. ఈ మాట చాలాకాలంగా వింటున్నాం. కానీ నిజానికి ఈ తరహా థియేటర్స్ ఆక్యుపెన్సీస్ అన్ని భాషల్లోనూ కొందరి చేతుల్లోనే ఉన్నాయనేది నిజం. ఇక లేటెస్ట్ రజినీకాంత్ పేటా చిత్ర ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ పెట్టి థియేటర్ మాఫియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. నయీమ్ లా వీళ్లను కూడా కాల్చి పారేయాలని అభ్యంతరకమైన మాటలూ అన్నాడు.

తన సినిమాకు థియేటర్స్ దొరక్కుండా దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ వాళ్లు, గీతా ఆర్ట్స్ బ్యానర్ వాళ్లు అడ్డుపడుతున్నారని.. నిజానికి ఇప్పుడు ఇన్ని సినిమాలు లేకపోతే వీళ్లలోనే ఎవరో ఒకరు పేటా చిత్రాన్ని కొనుక్కుని విడుదల చేసేవారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయంలో థియేటర్ మాఫియా నుంచి ఎప్పట్లానే నిశ్శబ్ధం ఆన్సర్ అవుతుందనుకున్నారు. బట్ గీతా ఆర్ట్స్ నుంచి గీత గోవిందం ప్రొడ్యూసర్ ఆ విషయంపై సీరియస్ గానే రియాక్ట్ అయ్యాడు.


ఏకంగా సదరు నిర్మాత పేరును కూడా ఉటంకిస్తూ ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ‘ ప్రసన్న గారూ.. మీరు తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం అనే హద్దుని దాటడం మాత్రమే మిగిలింది’’ అంటూ కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఇప్పటి వరకూ మాఫియా అని చెప్పుకుంటోన్న వాళ్లలో ఆ పదానికి రియాక్ట్ అయిన వాళ్లెవరూ లేరు. కానీ ఫస్ట్ టైమ్ లో గీతా ఆర్ట్స్ క్యాంప్ నుంచి బన్నీ వాస్ రియాక్ట్ కావడం కొంత ఆశ్చర్యంగానే ఉంది. మరి ఇది ఇతనితోనే ఆగుతుందా లేక దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ వాళ్లు కూడా రియాక్ట్ అవుతారేమో చూడాలి..