పక్కా బిజినెస్‌ మేన్‌లా మారిపోయిన మహేష్‌…!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త బిసినెస్ లో బిజీ అయిపోతున్నాడు. మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఎంటర్ అయి కొద్ది రోజుల క్రితమే వరల్డ్ క్లాస్ మల్టీప్లెక్స్, AMB సినిమాస్ ను లాంచ్ చేసాడు. మల్టీప్లెక్స్ బిసినెస్ లో అడుగుపెట్టడం తన 5ఏళ్ల కల అని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు సౌత్ లో అలాంటి మల్టీప్లెక్స్ థియేటర్ లేదని సెలెబ్రెటీలు కూడా పొగడ్తల వర్షం కురిపించారు.

ఇక ఆ బూస్టప్ తో మహేష్ బాబు మరో అడుగుముందుకేస్తున్నాడట. AMB సినిమాస్ ని దేశవ్యాప్తంగా విస్తరించే విధంగా మహేష్ ప్లాన్ చేస్తున్నాడట. ఇండియాలోని అన్నీ సిటీస్ లో, పెద్ద టౌన్స్ లో AMB సినిమాస్ ని స్ప్రెడ్ చేయడంపైనే ఇప్పుడు మహేష్ ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం.

ఒక చేత్తో సినిమాలు చేస్తూ, యాడ్స్ చేస్తూ, బిసినెస్ లో కూడా రానిస్తున్నారు సినీ తారలు. తమన్నా- జ్యూవెలరీ బిజినెస్, రకుల్ -జిమ్ సెంటర్… అలా సేఫ్ సైడ్ గా బిజినెస్ వైపు అడుగులేస్తున్నారు. ఆ కోవలోనే మహేష్ ఇలా మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలు పెట్టాడు.