సౌత్ లో నెంబర్ వన్…. మహేష్ బాబు సరికొత్త రికార్డు

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సౌత్‌ ఇండియాలోనే నెంబర్‌ వన్‌ హీరోగా అవతరించాడు. బాక్సాఫీస్‌ రికార్డ్‌ల పరంగా ఆయనకు తిరుగులేని హిస్టరీ ఉంది..తాజాగా ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా సైతం సరికొత్త రికార్డ్‌లు క్రియేట్‌ చేస్తున్నాడు.. యాడ్‌ మార్కెట్‌లో తిరుగులేని క్రేజ్‌ ఆయనది.. 

రీసెంట్‌గా మహేష్‌ ఆదాయం సినిమాల కన్నా యాడ్స్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఆదాయం పెంచుకోవడం ఎలాగో మహేష్ ని చూసే నేర్చుకోవాలి ఎవరైనా.. ప్రస్తుతం మహేష్ చేతిలో 15 కి పైగా కంపెనీల యాడ్స్ ఉన్నాయి.  గోల్డ్ విన్నర్, అభిబస్, చెన్నై సిల్క్స్, క్లోజ్ అప్‌, థమ్స్ అప్ వంటి ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ సౌత్ లోనే టాప్ బ్రాండ్ అంబాసిడర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. దక్షిణాదిలో ఈ రేంజ్‌లో యాడ్‌ మార్కెట్‌ ఉన్న హీరో మరెవరూ లేరు.. 

 రీసెంట్ గా మల్టిప్లెక్స్ బిజినెస్ మొదలుపెట్టిన మహేష్ త్వరలో నిర్మాతగా కూడా మారబోతున్నాడట. నిర్మాతగా మారి ఒక వెబ్ సిరీస్ ని నిర్మించేందుకు మహేష్ సిద్ధమవుతున్నది సమాచారం. కాగా ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్నాడు. ‘మహర్షి’ సినిమా ఈ ఏడాది వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.