కేసీఆర్‌ మినీ కేబినెట్‌ లిస్ట్‌ రెడీ.. హరీశ్‌కు కీలక శాఖ…!!


తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించిన కేసీఆర్, భవిష్యత్తులో కేటీఆర్ సీఎం అయితే ఆయనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా మంత్రి వర్గ విస్తరణ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు చేయబోయే కేబినెట్ మొత్తం కేటీఆర్ టీమ్ లా ఉండేలా కేసీఆర్ జాగ్రత్తపడుతున్నాడని సమాచారం.

ఇక తొలి విడుత క్యాబినెట్ లో కేవలం 8మంది మంత్రులనే ప్రకటించి లోక్ సభ ఎన్నికల తరువాత పూర్తిస్థాయి కేబినెట్ ప్రక్షాళన చేయాలని కేసీఆర్ ఆలోచనగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ 8మంది మంత్రులతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీప్ విప్ ను కూడా ప్రకటిస్తారా. అంటే ఓవర్ ఆల్ గా 11 మందితో కేసీఆర్ తొలి విడుత కేబినెట్ ఉండబోతుందన్నమాట. తొలి విడతలో ఉండే 8మంది మంత్రులలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కన్ఫామ్. ఇక గత కేబినెట్ లో సినిమాల మంత్రిగా పని చేసిన తలసాని శ్రీనివాస్ కు ఈ కేబినెట్ లో కూడా చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆయనతోపాటు బీసీ సామాజిక వర్గం నుండి ఈటెల రాజేందర్ కు కూడా తోలి విడత కేబినెట్ లో చోటు దక్కుతుందని భావిస్తున్నారు.

ఇక హోమ్ మినిస్టర్ గా చేసిన నాయిని నర్సింహా రెడ్డిని ఈసారి పార్లమెంటుకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ స్థానంలో వనపర్తి ఎమ్మెల్యే శింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే మొదటి విడతలో ఆయన పేరు ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

మరోవైపు మహిళా నేతకు ఈసారి కేబినెట్ లో చోటు కల్పిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో డిఫ్యూటి స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేంద‌ర్‌ రెడ్డిని ఈసారి కేబినెట్ లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారట కేసీఆర్. అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ గా ఎంపిక చేయొచ్చని మరో టాక్. ఎస్టీ వర్గం నుండి సీనియర్‌ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు ఛాన్స్‌ దక్కనుందట. తొలి విడతగా 11 మందితో కేబినెట్ కూర్పు చేసి లోక్ సభ ఎన్నికల తరువాత రాజకీయ సమీకరణాలను బట్టి మిగతా క్యాబినెట్ ని పూర్తి చేస్తారట.