పవన్ కళ్యాణ్ కథతో బిగ్ బాస్ కౌశల్ సినిమా…

బిగ్ బాస్ సీజన్2 తో గుర్తింపు తెచ్చుకున్న మోడల్ కౌశల్ మందా ఆ క్రేజ్ ను బాగా వాడుకుంటున్నాడు. ఏమంటే బిగ్ బాస్ కి వచ్చాడో కానీ కౌశల్ జతకమే మారిపోయింది.  అతని కష్టానికి అదృష్టం బానిసైపోయిందనే చెప్పాలి. యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని సీరియల్స్ లో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన కౌశల్ ఇప్పుడు ఏకంగా హీరో అయిపోయాడు.

ఓ యువ దర్శకుడు రెడీ చేసిన కథకు కౌశల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఆ కథ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల ఆధారంగా రెడీ చేసినట్లు తెలుస్తోంది. అందుకే సినిమాకు ‘సేనాని’ అనే టైటిల్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాకు సంబంధించి ఓ ప్రముఖ నిర్మాత అందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి  చేసినట్లు సమాచారం. ఇక్కడ నిర్మాత కూడా మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని టాక్ రావడంతో కథ పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌశల్ హీరోగా రాబోయే సినిమాలో టాలీవుడ్ లోని స్టార్ నటీనటులు కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే సినిమా టైటిల్ కి సంబంధించిన పోస్టర్ ని, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడట.

ఎన్నికల వేళ విడుదలవుతున్న ఎన్టీఆర్, వైస్సార్ బయోపిక్ లు ఏపీలోని ప్రధాన పార్టీలైన టిడిపి, వైసీపీకి ప్రచారంగా మారబోతున్నాయన్న టాక్ వస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ కథతో ఒక సినిమా రూపొందిస్తే అటు పవన్ క్రేజ్, ఇటు కౌశల్ క్రేజ్ తో సినిమా రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుందని, అది ఎన్నికల సమయానికి జనసేన పార్టీకి ఉపయోగపడుతుందని… తెర వెనుక మెగా ఫ్యామిలీ ఈ సినిమా ప్రయత్నాలు చేస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.