కొత్త అల్లుడికి జగ్గూభాయ్ గ్రాండ్ వెల్కమ్:

దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయకు- హీరోజగపతి బాబు అన్న కూతురు  పూజ ప్రసాద్ కు కొద్ది రోజుల క్రితమే జైపూర్ వేదికగా గ్రాండ్ గా పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ లోని స్టార్స్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అనుష్క, నాని చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక పెళ్లి సంబరాలతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా ముగించుకొని భార్యతో పాటు హైదరాబాద్ లో అడుగుపెట్టిన కార్తికేయకు జగపతి బాబు కుటుంబం గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.

సంక్రాంతి పండగకు కొత్త అల్లుడు ఇంటికొస్తే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగ్గూభాయ్ కూడా తన అల్లుడు కార్తికేయకు హార్ట్ ఫుల్ గా వెల్కమ్ చెప్పాడు. కార్తికేయల వివాహ సంబరాలలో హైదరాబాద్ కొన్ని అద్భుతమైన ఫోటోలను సంపాదించింది అంటూ ఓ ఫోటోను జగపతిబాబు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఫోటోను షేర్ చేస్తూ  “మీ రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది… వెల్ కమ్ అల్లుడు గారు” అంటూ ట్వీట్ చేశాడు జగ్గు బాయ్. జగపతి బాబు పెట్టిన ట్వీట్ కి నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. పండగకి కొత్త అల్లుడు వచ్చాడు… హ్యాపీ పొంగల్ అంటూ జగపతి బాబు ట్వీట్ కి రీట్వీట్ చేస్తున్నారు.