F2లో ఫన్‌ తక్కువ.. ఫ్రస్ట్రేషన్‌ ఎక్కువ అయిందా…??

ఈ ఏడాది సంక్రాంతి బరిలో దూకిన చివరి తెలుగు సినిమా ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్. సంక్రాంతి పండుగ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన పక్కా ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్2.  వెంకటేష్-వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ కి అనిక్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు సినిమాను నిర్మించారు.  

కామెడీని ప్రధానంగా నమ్ముకునే దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి పూర్తిస్థాయి కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  పెళ్లికి ముందు పెళ్లి తరువాత మగాళ్ల జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో మంచి కామెడీని క్రియేట్ చేశాడు. అనిల్ రావిపూడి కథ కన్నా సీన్స్ బేస్ చేసుకొని సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించాడు.  గతంలో ఎన్నడూ లేని విధంగా వరుణ్ పాత్రను ఒక తెలంగాణ యువకుడిగా ప్రజెంట్ చేయడం బావుంది. వెంకీ చాలా కాలం తరువాత తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. వరుణ్ తేజ్ కూడా సీనియర్ హీరో వెంకీతో పోటీ పడి నటించాడు. తమన్నా – మెహ్రీన్ లు డామినేట్ చేసే సిస్టర్స్ గా అలరించారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. 

ఫస్ట్ హాఫ్ లో తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించిన వెంకటేష్ హాఫ్ కి వెళ్లే సరికి రొటీన్ కామెడీతో బోర్ కొట్టించేసాడనే టాక్ వినిపిస్తోంది. ఇక వెంకటేష్ సీనియారిటీ ముందు వరుణ్ తేజ్ తేలిపోయాడని,  నటుడిగా వరుణ్ ఇంకా ఇంప్రూవ్ కావాలని అంటున్నారు. తమన్నా, మెహ్రీన్ పత్రాలు పెద్దగా మెప్పించలేకపోయాయని, మెహరీన్ హానీ రోల్ లో చాలా ఇబ్బంది పడుతూ చూసే వారిని ఇబ్బంది పెట్టిందని చెబుతున్నారు. ఇక అసలు ఫార్మ్ లో లేని దేవిశ్రీ సంగీతం మెప్పించలేకపోయింది. రెండు పాటలు బాగున్నా… బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దేవి చేసినట్టే లేదని అంటున్నారు. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే పర్వాలేదనిపిస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ ని ఇంట్రెస్టింగ్ గా నడిపించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథ విషయంలో చేతులెత్తేశాడని అంటున్నారు.

సెకండ్‌ హాఫ్ లో కథ లేక కామెడీ సీన్లతో బోరింగ్ కామెడీ సీన్లతో నింపేసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్ అనిల్. ఇక ఫైనల్ గా సినిమా అయితే ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయిన జస్ట్ ఒకే అనే టాక్ యూఎస్ వర్గాల నుండి వినిపిస్తోంది. మరి మన ఆడియేన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.