బ్రేకింగ్ న్యూస్.. బోయపాటితో ఇస్మార్ట్ హీరో

ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇవాళ అనుకున్న కాంబినేషన్ రేపటికి మారొచ్చు. అసలు ఎప్పుడూ ఊహించని కాంబినేషన్ అనౌన్స్ కావొచ్చు. అలాంటిదే ఇది. అఖండతో అద్భుత విజయం అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను తర్వాతి సినిమా విషయంలో ఇప్పటి వరకూ ఎన్నో ఊహాగానాలు వచ్చాయి.. వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా కన్నడ స్టార్ యశ్ తో సినిమా చేస్తాడని మొదట్లో అన్నారు. తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా అంటున్నారు. చాలా వరకూ బోయపాటి, అల్లు అర్జున్ కాంబోలో సినిమా గ్యారెంటీ అనుకున్నారు. ఈ టైమ్ లో అనూహ్యంగా ఇప్పుడు బోయపాటి, రామ్ కాంబోలో సినిమా అనే వార్త హల్చల్ చేస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా ఓ రేంజ్ లో కనెక్ట్ అయ్యాడు రామ్. తర్వాత చేసి రెడ్ పోయినా ఇప్పుడు ది వారియర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ బై లింగ్వుల్ గా రాబోతోంది. ది వారియర్ తర్వాత రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఏ వార్తా లేదు. అలాంటిది బోయపాటి డైరెక్షన్ లో సినిమా అనే వార్త నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి అల్లు అర్జున్ సినిమా ఏమైందీ అనే డౌట్ కూడా ఈ సందర్భంగా వస్తుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం సిద్ధమవుతున్నాడు. తర్వాత తను ఊహించిన రేంజ్ లో పెరిగిన మార్కెట్ ను నిలబెట్టుకునేందుకు ఇతర ప్లానింగ్ లు వేసుకుంటున్నాడట. ఈ విషయం బోయపాటికి తెలిసింది. దీంతో తనతో చేయడం ఇప్పుడప్పుడే కాదు అనేది కూడా అర్థమైందట. అందుకే తను రామ్ తో సినిమా చేయడానికి ప్లానింగ్ చేసుకున్నాడంటున్నారు.
ఇక బోయపాటితో సినిమా చేస్తే.. రామ్ మార్కెట్ రేంజ్ కూడా పెరుగుతుంది. అలాగే ఇప్పటి వరకూ బోయపాటి చేసిన సినిమాలన్నీ ఊరమాస్ చిత్రాలే. అంతకు ముందంటే చెప్పలేం కానీ.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత అతని రేంజ్ కూడా మారింది. రామ్ మాస్ మూవీస్ చేస్తే చూడ్డానికి జనం సిద్ధంగా ఉన్నారన్న విషయం ఆ సినిమా విజయం చెప్పింది. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే రాబోతున్నాయట.

Related Posts