ఆ టీవీ చానెల్‌ని ఉతికి ఆరేస్తున్న నటి అపూర్వ

 


ఆ టీవీ చానెల్‌… తెలుగు న్యూస్‌లో తిరుగులేని హవా నడిపిస్తోంది. అలాంటి చానెల్‌ తాజాగా చేసిన వ్యవహారంపై సినీ నటి అపూర్వ మండిపడుతోంది.. ఆ చానెల్‌ని అనరాని మాటలతో విరుచుకుపడుతోంది.. ఇంతకీ ఆ చానెల్‌ చేసిన నిర్వాకం ఏంటంటే….

నటి అపూర్వని ఇటీవల ఆ చానెల్‌ ప్రతినిధులు ఓ ఇంటర్‌వ్యూ అడిగారట.. ఆమె వ్యక్తిగత జీవితంపై ఇటీవల కొన్ని కాంట్రవర్శీలు నడుస్తున్నాయి.. భర్త ఆమెకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో కలిసి ఉంటున్నాడని, తనపై ఓ యూ ట్యూబ్‌ చానెల్‌లో అంతా నెగిటివ్‌ స్టోరీలు రాయించారని సైబర్‌ కేసు ఫైల్‌ చేసింది.. అంతేకాదు, తన భర్త వెనుక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఉన్నాడని, ఆయన మద్దతుతోనే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించింది అపూర్వ..

అయితే, అపూర్వ కేసు వేడిని టీఆర్‌పీలుగా మలుచుకుందామని భావించిన ఆ చానెల్‌కి ఆమె ఇంటర్‌వ్యూ ఇవ్వలేదట.. తన వ్యక్తిగత సమస్యలతో దూరంగా ఉండడంతో అపూర్వ హీట్‌ని ఎలాగయినా క్యాష్‌ చేసుకోవాలని భావించిన సదరు చానెల్‌ వ్యూహాత్మక ఎత్తుగడ వేసిందట. కుదరకపోవడంతో వెంటనే ఆమె గతంలో ఓ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్‌వ్యూని తీసుకొని దానికి, ఆమె భర్త ఇచ్చిన కౌంటర్‌ని రెడీ చేసి టెలికాస్ట్‌ చేశారట.

దీనిని ముందుగానే రికార్డ్‌ చేసి కాసేపట్లో నటి అపూర్వ కథ అంటూ కమింగ్‌ అప్‌లతో హోరెత్తించిందట.. అయితే, తీరా చూస్తే ఆ చానెల్‌ గతంలో ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్‌వ్యూని తీసుకొని ఇక్కడ ప్లే చేసి రచ్చ చేసిందని ఆమె వాపోతోందట.. ఇదెక్కడి తలనొప్పి అని అపూర్వ కన్నీటి పర్యంతం అయిందని సమాచారం.. తన పర్సనల్‌ లైఫ్‌ని సెట్‌ చేసుకోవాలని చూస్తుంటే, ఆ టీవీ చానెల్‌ తన లైఫ్‌ని రోడ్డుపైన పెడుతోందని ఆమె మధన పడుతున్నారట.. ఇంతకీ ఆ చానెల్‌ ఏంటో అర్ధం అయి ఉంటుంది కదా..