హాలీవుడ్ నటుడితో అనుష్క

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్క కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. గత ఏడాది భాగమతి సినిమాతో బాక్స్ ఆఫీస్ కి కొత్త లెక్కలు చెప్పిన స్వీటీ మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన ఈ అమ్మడు బరువు తగ్గడానికి నానా కష్టాలు పడింది.  సినిమాలకు దూరమై విదేశాల్లో పలు ట్రీట్‌మెంట్స్ తీసుకుంది. కాస్త బరువుతగ్గడంతో ఇటీవలే ఒక సినిమాకు సైన్ చేసిన చేసిందట స్వీటీ. అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ థ్రిల్లర్ మూవీలో అనుష్క ప్రధాన పాత్రలో కనిపించనుందట. మూవీ షూటింగ్ చాలా వరకు అమెరికాలోనే జరగనుందని సమాచారం. కాగా ఈ సినిమా నుండి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది.

ఈ సినిమాలో స్వీటీ ఓహాలీవుడ్ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. కిల్ బిల్ యాక్టర్ మైకేల్ మడ్సన్ అనే హాలీవుడ్ నటుడు  అనుష్క సినిమాలో  విలన్ గానటించబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న ఈ థ్రిల్లర్ మూవీలో హీరో మాధవన్,నటుడు సుబ్బరాజు  కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇక ఈ సినిమాలో అనుష్క చెవుడు ఉన్న ఓ అంధురాలి పాత్రలో కనిపించనుందట. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించబోతున్న ఈ సినిమాకు ‘సైలెన్స్’ టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఇటీవలే ఆయన ఈ సినిమా కోసం ఒక మంచి పాటని కంపోజ్ చేశారట. ఈ ఏడాది మర్చి నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఏడాది చివరి కల్లా షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదల చేయాలనీ చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట.