Advertisement
సినిమా టిక్కెట్ల రేటు పెంపుకు తెలంగాణ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్
Latest Movies Tollywood

సినిమా టిక్కెట్ల రేటు పెంపుకు తెలంగాణ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్

Advertisement

సినిమా టిక్కెట్ల పెంపు గురించి.. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా డిష్క‌స‌న్స్ జ‌రుగుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టిక్కెట్ల రేటు త‌గ్గించ‌డం.. థియేట‌ర్లో త‌నిఖీలు చేస్తూ థియేట‌ర్ల‌ను మూసివేయ‌డంతో సినీ ప్ర‌ముఖులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త కొన్ని రోజులు నుంచి సినీ నిర్మాత‌లు టిక్కెట్ల రేటు పెంచాల‌ని తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

సంక్రాంతికి భారీ చిత్రాలు విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో తెలంగాణ స‌ర్కారు సినిమా టిక్కెట్ల పెంపుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఆస‌క్తిగా మారింది. భారీ చిత్రాల‌కు టిక్కెట్ల రేటు పెంచుకునేలా ఉత్త‌ర్వ‌లు జారీ చేయ‌డం జ‌రిగింది. అధికారుల కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏసీ థియేటర్లలో కనిష్ఠం రూ. 50.. గరిష్ఠం 150, మల్టీప్లెక్స్‌ల్లో కనిష్ఠం రూ.100.. గరిష్ఠం రూ.250, మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్‌ సీట్లకు గరిష్ఠంగా రూ.300.. టికెట్‌ ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనం అని ప్ర‌క‌టించారు.

దీని వ‌ల‌న సంక్రాంతికి రానున్న సినిమాల‌కు బాగా క‌లిసొస్తుంది. అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా టిక్కెట్ల రేటు పెంపుకు సంబంధించి ఉత్త‌ర్వ‌లు వ‌స్తాయ‌ని నిర్మాత‌లు ఆశిస్తున్నారు. మ‌రి.. ఏపీ స‌ర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement