మిల్కీ బ్యూటీ తమన్నా బౌన్సర్స్ వీడియో జర్నలిస్ట్ లపై దాడి చేయడం సంచలనం సృష్టిస్తోంది. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న తమన్నా ప్రస్తుతం బబ్లీ బౌన్సర్ అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రంలో తమ్మూ కూడా లేడీ బౌన్సర్ పాత్రలోనే కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల కానున్న ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ కోసం ఇవాళ(శనివారం) అన్నపూర్ణ స్టూడియోలో మీడియా మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ మీట్ లో కొందరు వీడియో, ఫోటో జర్నలిస్ట్ లు తమన్నా ఫోటోస్ తీసుకున్నారు.

మరి తర్వాత ఏమైందో కానీ సడెన్ గా తమన్నా బౌన్సర్లు వీరిపై దాడికి దిగారు. అక్కడ ఉన్న డస్ట్ బిన్స్ తో పాటు మరికొన్ని వస్తువులు పట్టుకుని మరీ వీరిపై దాడి చేసే ప్రయత్నం చేశారు.ఈ దాడిలో ఇద్దరు కెమెరామెన్ కు దెబ్బలు తగిలాయి. కేవలం తమన్నా వీడియో బైట్ కోసం ప్రయత్నిస్తున్నారనే కారణంతోనే వారు దాడికి దిగారు. అయినా మీడియాతో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు బైట్స్ తీసుకోవడం కామన్. ఆ కామన్ సెన్స్ లేకుండా తమన్నా సహాయకులు, లేదా ప్రోగ్రామ్ ను అరేంజ్ చేసినవారు బౌన్సర్స్ ను కంట్రోల్ చేసి ఉండాల్సింది.

అలా చేయకపోవడంతో మొత్తం రచ్చరచ్చ అయిపోయింది. ఇక జరిగిన విషయంపై మీడియా సీరియస్ అయింది.ఓ దశలో సదరు బౌన్సర్స్ పై కేస్ కూడా పెట్టాలని ప్రయత్నించారు. కానీ నిర్వాహకులు సర్ది చెప్పి వారితో సారీ చెప్పించడంతో గొడవ సద్దు మణిగింది. కానీ ఇలాంటి విషయాలు ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు కూడా జరిగాయి. కామన్ పీపుల్ కు, మీడియా వారికి మధ్య తేడా తెలియని బౌన్సర్స్ ను నియమించుకుంటే ఇలాగే జరుగుతుంది.కామన్ పీపుల్ అంటే వారు తక్కువ మీడియా వారు ఎక్కువ అని కాదు.. జనరల్ ఆడియన్‌స్ అయితే సినిమా వారిని చూస్తే హద్దులు తెంచుకుని ప్రవర్తిస్తారు. కానీ మీడియా వాళ్లు వారిని తరచూ చూస్తుంటారు కాబట్టి వారికి వీరితో ఏ సమస్యా ఉండదు.

, , ,